
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తిచేశారు బాలయ్య. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తర్వాత బాలకృష్ణ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. బాలకృష్ణ కెరీర్లో 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇక ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాలలో దర్శకులు బోయపాటి శ్రీను.. వినాయక్.. హరీష్ శంకర్, కొరటాల శివ, బాబీ, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సన, సాయి మాధవ్ బుర్రా, శ్రుతిహాసన్ హాజరయ్యారు. వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ హరీష్ శంకర్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.
ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సత్తా చాటుతున్నాడు బాలకృష్ణ. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికపై బాలయ్య హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో మొదటి ఎపిసోడ్ అతిథులుగా మంచు మోహన్ బాబు.. మంచు లక్ష్మి… విష్ణు విచ్చేయగా.. సెకండ్ గెస్ట్‌గా న్యాచరల్ స్టార్ నాని విచ్చేశారు.
Also Read: Samantha: ఇతరులు చేసిన పని నువ్వు కూడా చేయాలని లేదు.. సమంత చేసిన పోస్ట్‌కు అర్థమేంటో ?
Maalavika Sundar: తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్.. ఫోటోస్ వైరల్..