ప్రముఖ దర్శకుడికి గుండెపోటు..పరిస్థితి విష‌మం…

ప్రముఖ మలయాళీ ర‌చ‌యిత‌, దర్శకనిర్మాత కేఆర్​ సచిదానంద‍న్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గుర‌య్యారు. ‌ గుండెపోటు రావ‌డంతో వెంట‌నే ఆయ‌న్ను త్రిశూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ స‌భ్యులు.

ప్రముఖ దర్శకుడికి గుండెపోటు..పరిస్థితి విష‌మం...
Follow us

|

Updated on: Jun 17, 2020 | 1:19 PM

ప్రముఖ మలయాళీ ర‌చ‌యిత‌, దర్శకనిర్మాత కేఆర్​ సచిదానంద‍న్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గుర‌య్యారు. ‌ గుండెపోటు రావ‌డంతో వెంట‌నే ఆయ‌న్ను త్రిశూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ స‌భ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య‌ పరిస్థితి విషమంగా ఉండ‌టంతో… వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు డాక్ట‌ర్లు వెల్లడించారు. ఇప్పటికే సచిదానంద‍న్ ఆర్థోపెడిక్‌ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయనకు హిప్ సర్జరీ జరిగింది. ఆ సర్జరీ నుంచి కోలుకుంటూ ఉండగా కార్డియాక్ అరెస్ట్ అయినట్టు మాలీవుడ్ సమాచారం .

ఇటీవల మ‌ల‌యాళ‌ స్టార్​ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బిజూ మేనన్‌ నటించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్’ చిత్రాన్ని తెర‌కెక్కించారు సచిదానంద‍న్. ఈ సినిమా ఊహించని విజయం సొంతం చేసుకుంది. ఆ మూవీ చిత్రీక‌ర‌ణ సమయంలోనే కాలు నొప్పితో బాధపడ్డారీ దర్శకుడు. మొద‌ట‌ పృథ్వీరాజ్‌ హీరోగా వచ్చిన ‘చాక్లెట్‌’ చిత్రానికి స్టోరీని అందించిన‌ సచి… 2015లో విడుదలైన ‘అనార్కలి మూవీతో డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చారు.