Ashok Galla’s Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా “హీరో” రిలీజ్ అప్పుడే..

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో చిత్రంతో టాలీవుడ్ లో కథానాయకుడిగా అడుగుపెడుతున్నారు అశోక్ గల్లా. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.

Ashok Gallas Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా హీరో రిలీజ్ అప్పుడే..

Updated on: Jan 01, 2022 | 8:55 PM

Ashok Galla: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో చిత్రంతో టాలీవుడ్ లో కథానాయకుడిగా అడుగుపెడుతున్నారు అశోక్ గల్లా. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి హీరో చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హీరో సినిమా ఈ నెల 15న సంక్రాంతి పండక్కి థియేటర్‌లలో విడుదల కాబోతోంది. అశోక్‌ గల్లా కు హీరో మొదటి చిత్రమే అయినా ఎంతో మెచ్యూర్డ్ గా నటించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్టింగ్ తో పాటు లుక్స్‌తో అశోక్ గల్లా ఆకట్టుకున్నాడు. పవర్ ఫుల్ రోల్‌లో అశోక్‌ గల్లాను హీరో చిత్రంలో చూడబోతున్నామని చెప్పొచ్చు.

ఇక డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య టాలెంటెడ్ డైరెక్టర్. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఈ కాంబినేషన్ పై అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘హీరో’ సినిమా సరికొత్త కథాంశంతో ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. జనవరి 15న తాము ఆశించిన విజయం దక్కుతుందనే పూర్తి నమ్మకంతో ఉంది హీరో మూవీ టీమ్. ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..

Shanmukh Jaswanth: ఇకపై సిరితో షణ్ముక్ ప్రేమ ప్రయాణం.. పాపం దీప్తి బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందట..

Kollywood to Tollywood: టాలీవుడ్‌కు క్యూకడుతున్న కోలివుడ్ స్టార్ హీరోలు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us