Balakrishna: బాలయ్య సినిమాకు హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా.? ఆ ఇద్దరు భామలతో నటసింహం

ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు బాలయ్య. ఇక ఇప్పుడు ఆయన అనీల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Balakrishna: బాలయ్య సినిమాకు హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారా.? ఆ ఇద్దరు భామలతో నటసింహం
Balakrishna

Updated on: Jun 29, 2023 | 10:09 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన లైనప్ చేసిన సినిమాలు అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు బాలయ్య. ఇక ఇప్పుడు ఆయన అనీల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగార్వల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాలో శ్రీలీల కూడా నటిస్తుంది

భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల బాలయ్య చెల్లెలిగా కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ మూవీతో పాటు బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు నటసింహం. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బాబీ. బాలయ్య కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పనుల్లో బాబీ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలయ్యకు హీరోయిన్స్ ను ఫిక్స్ చేశారట బాబీ. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా నయనతార నటిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యతో మూడు సినిమాల్లో నటించారు నయన్. సింహ, శ్రీరామ రాజ్యం, జై సింహ సినిమాల్లో నటించారు. అలాగే మరో హీరోయిన్ గా రకుల్ ను అనుకుంటున్నారట. బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో శ్రీదేవి గా నటించింది రకుల్. ఇప్పుడు మరోసారి బాలయ్య సినిమాలో నటించనుందని తెలుస్తోంది.