AR Rahman: మళ్లీ పుట్టానంటోన్న ఏఆర్ రెహమాన్..

AR Rahman: ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. నిర్మాతగా, రచయితగా ఆయన తొలి అడుగులు వేయబోతున్నారు. ’99 సాంగ్స్’ పేరుతో సంగీత నేపథ్యంలో సాగే ప్రేమ కథతో ప్రేక్షకులకి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు ఏఆర్ రెహమాన్. ఎహాన్ భట్, ఎడిల్సీ వర్ఘేస్ ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంగీతాన్ని కూడా ఏఆర్ రెహమనే అందిస్తున్నారు. గతేడాది బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో […]

AR Rahman: మళ్లీ పుట్టానంటోన్న ఏఆర్ రెహమాన్..

Updated on: Feb 28, 2020 | 8:54 PM

AR Rahman: ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. నిర్మాతగా, రచయితగా ఆయన తొలి అడుగులు వేయబోతున్నారు. ’99 సాంగ్స్’ పేరుతో సంగీత నేపథ్యంలో సాగే ప్రేమ కథతో ప్రేక్షకులకి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు ఏఆర్ రెహమాన్. ఎహాన్ భట్, ఎడిల్సీ వర్ఘేస్ ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంగీతాన్ని కూడా ఏఆర్ రెహమనే అందిస్తున్నారు. గతేడాది బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అతి త్వరలో తెలుగు, తమిళం, హిందీ బాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇటీవలే ఈ చిత్రం గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడారు. ఈ సినిమా కోసం నిర్మాతగా మారడం కొత్త అనుభవమన్న ఆయన..మళ్లీ పుట్టానన్న భావన కలుగుతుందని పేర్కొన్నారు. స్వరకర్తగా మారేటప్పటికి..తనకు సంగీత రంగంలో పదేళ్ల అనుభవం ఉందని..కానీ నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టడంతో, మళ్లీ మెదట్నుంచి జర్నీ చేస్తున్నట్టు అనిపిస్తుందన్నారు. ’99 సాంగ్స్’ మూవీకి  దర్శకులు, నటులు అందరూ కొత్తవారని..అందుకే పరిమిత బడ్జెట్‌లో మూవీ తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చారు. నిర్మాతగా మారిన క్రమంలో అందులో కూడా 100 శాతం పనితీరుగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తానని ఏఆర్ రెహమాన్ తెలిపారు.

ఇది కూడా చదవండి :‘కేజీఎఫ్​’ హీరో హత్యకు ప్లాన్ చేసిన రౌడీషీటర్ ఎన్​కౌంటర్​…

Loading...
Unable to load recommendations.
Follow Us