AR Rahman: రజినీకాంత్ సినిమాలు అంటే నరకం.. సంచలన కామెంట్స్ చేసిన రెహమాన్..

సినిమా ఏదైనా తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఏ ఆర్ రెహమాన్ ముందు వరుసలో ఉంటారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ - రెహమాన్ కాంబినేషన్ అంటే చెప్పాలిసిన అవసరం లేదు.

AR Rahman: రజినీకాంత్ సినిమాలు అంటే నరకం.. సంచలన కామెంట్స్ చేసిన రెహమాన్..
Rehaman
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 13, 2021 | 6:46 AM

AR Rahman: సినిమా ఏదైనా తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఏ ఆర్ రెహమాన్ ముందు వరుసలో ఉంటారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ – రెహమాన్ కాంబినేషన్ అంటే చెప్పాలిసిన అవసరం లేదు. రజినీకాంత్ సినిమాలకు రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తారు రెహమాన్. ఒకానొక సమయంలో ఈ ఇద్దరి కాంబో సౌత్ లో సెన్సేషన్‌గా మారింది. రజినీ మార్క్ మ్యానరిజం – స్టైల్ – యాక్టింగ్ కు తగ్గట్టుగా సంగీతం అందించడంలో దిట్ట రెహమాన్. ఇప్పటి వరకు ‘ముత్తు’ ‘అరుణాచలం’ ‘బాబా’ ‘శివాజీ’ ‘రోబో’ ‘కొచ్చాడయాన్’ ‘రోబో 2.0’ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ రజినీకాంత్ సినిమాలగురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. రజినీకాంత్ సినిమాలకు పనిచేయాలంటే నరకంగా అనిపించేది అని షాకింగ్ కామెంట్స్ చేశారు రెహమాన్.

సహజంగానే రజినీకాంత్ సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. మ్యూజిక్ పరంగా ఆ అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై ఉండేది అన్నారు. ఇతర ప్రాజెక్టులతో నేను బిజీగా ఉన్నప్పుడు రజనీ సార్ సినిమాలు వచ్చేవి. మాములుగా రజనీ సినిమాలు దీపావళికి ఎక్కువగా విడుదలయ్యేవి. ఆ సమయానికి నేను నా వర్క్ పూర్తి చేయవలసి ఉండేది. నాకు చాలా తక్కువ సమయం ఇచ్చేవారు. దాంతో నేను చాలా టెన్షన్ పడేవాడిని అని చెప్పుకొచ్చారు. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసేవాడిని కాబట్టి రజనీకాంత్ చిత్రాలకు చాలా తక్కువ సమయం ఉండటంతో ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీపావళి అయినా.. న్యూ ఇయర్ అయినా పొంగల్ అయినా అవి నాకు నరకం గా అనిపించేవి అని చెప్పుకొచ్చారు రెహమాన్.

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..