AP Government: టికెట్‌ రేట్లపై డివిజన్‌ బెంచ్‌కి.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం..

|

Dec 14, 2021 | 9:50 PM

టికెట్‌ రేట్లపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్‌ బెంచ్‌కి వెళ్లాలని నిర్ణయించింది. అంతక ముందు సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఏపీ సర్కారు ఇచ్చిన..

AP Government: టికెట్‌ రేట్లపై డివిజన్‌ బెంచ్‌కి.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం..
Cm Jagan
Follow us on

టికెట్‌ రేట్లపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్‌ బెంచ్‌కి వెళ్లాలని నిర్ణయించింది. అంతక ముందు సినిమా టికెట్ల రేట్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఏపీ సర్కారు ఇచ్చిన జీవో నెం.35ని కొట్టేసింది హైకోర్టు. పాత విధానంలో టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ థియేటర్‌ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునే హక్కు థియేటర్‌ యజమానులకు ఉంటుందన్నారు పిటిషనర్లు.

దీనిపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. టికెట్‌ రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్‌ తరపు న్యాయవాదులు. ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

దీనిపై ఏపీ సర్కార్‌ ఇప్పుడు అప్పీల్‌కు వెళ్లనుంది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై.. డివిజన్‌ బెంచ్ కు వెళ్లాలని భావిస్తోంది. సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని అప్పీల్‌కు వెళ్లాలని ఏపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి: Student Innovation: చప్పట్లతోనే ఆన్.. ఆఫ్.. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ

భగవద్గీతను ఆచరించి.. భావి తరాలకు అందించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామిజీ పిలుపు