Tollywood: టాలీవుడ్ సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్.. 2025 పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, టెలివిజన్‌ రంగానికి సంబంధించి 2025 సంవత్సరానికి పురస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది..ఆంధ్రప్రదేశ్‌ 2025 చలనచిత్ర, టీవీ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఉత్తమ చిత్రాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులతో పాటు బాలల, డాక్యుమెంటరీ, టెలివిజన్‌ విభాగాలకు అవార్డులు. ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 20 చివరి తేదీ .

Tollywood: టాలీవుడ్ సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్.. 2025 పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
Ap

Updated on: Oct 08, 2026 | 5:27 PM

ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, టెలివిజన్‌ రంగానికి సంబంధించి 2025 సంవత్సరానికి పురస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ కళాకారులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి అవార్డులు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC)  ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు భాషలో దేశంలో ఎక్కడైనా నిర్మించిన చిత్రాలు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగి ఉంటాయి. ఉత్తమ చిత్రాలతో పాటు జాతీయ సమైక్యత, బాలల, డాక్యుమెంటరీ, విద్యా సంబంధిత చిత్రాలకు కూడా ప్రత్యేక విభాగాల్లో అవార్డులు అందించనున్నారు.

చలనచిత్రాలతో పాటు టెలివిజన్‌ రంగంలోనూ 2025 సంవత్సరానికి పురస్కారాలను ప్రకటించనున్నారు. టీవీ చిత్రాలు, టెలిఫిల్మ్స్, టీవీ ఫీచర్స్, డైలీ సీరియల్స్‌ తదితర విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నారు. అలాగే బాలల కోసం రూపొందించిన టీవీ చిత్రాలు, డాక్యుమెంటరీలు, సామాజిక అంశాలపై రూపొందించిన కార్యక్రమాలకు కూడా పురస్కారాలు అందించనున్నారు. పురస్కారాలకు సంబంధించిన పూర్తి వివరాలు AP State Film, Television and Theatre Development Corporation అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో అక్టోబర్ 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేవారు అక్టోబర్ 25వ తేదీలోగా తమ దరఖాస్తులను విజయవాడలోని ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయానికి పంపించాలని FDC మేనేజింగ్ డైరెక్టర్ కోరారు. చలనచిత్ర, టెలివిజన్ రంగాల్లో 2025లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, సంబంధిత సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us