Tollywood: కాలేజీ రోజుల్లో ఈ స్టార్ హీరోయిన్స్ ఎలా ఉన్నారో చూశారా ?.. దీపికా, అనుష్కను గుర్తుపట్టడం కష్టమే..

సినీ ప్రయాణం మొదలుపెట్టి ఎన్నో అడ్డంకులను దాటుకుని.. అవకాశాలను అందుకుని స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు. భాషతో సంబంధం లేకుండా అనేక చిత్రాల్లో నటించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో నిలిచారు. అలాంటి వారిలో బాలీవుడ్ తారలు దీపికా పదుకొణే, అనుష్క శర్మ, అనుష్క శెట్టి కూడా ఉన్నారు. ఈ ముగ్గురికి అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. కానీ మీకు తెలుసా ?.

Tollywood: కాలేజీ రోజుల్లో ఈ స్టార్ హీరోయిన్స్ ఎలా ఉన్నారో చూశారా ?.. దీపికా, అనుష్కను గుర్తుపట్టడం కష్టమే..
Anushka, Deepika, Anushka

Updated on: Jan 20, 2024 | 12:32 PM

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కొందరు హీరోయిన్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందం, అభినయంతో మెప్పించి అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకపోయినా.. సినీ ప్రయాణం మొదలుపెట్టి ఎన్నో అడ్డంకులను దాటుకుని.. అవకాశాలను అందుకుని స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు. భాషతో సంబంధం లేకుండా అనేక చిత్రాల్లో నటించి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో నిలిచారు. అలాంటి వారిలో బాలీవుడ్ తారలు దీపికా పదుకొణే, అనుష్క శర్మ, అనుష్క శెట్టి కూడా ఉన్నారు. ఈ ముగ్గురికి అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. కానీ మీకు తెలుసా ?. ఈ ముగ్గురు చదువుకున్న కాలేజీ ఒక్కటే అని. అవును… ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్లుగా ఉన్న అనుష్క శర్మ, దీపికా చదువుకున్నది బెంగుళూరులోనే. ఇంతకీ ఈ మ్యాటరెందుకు ఇప్పుడు అనుకుంటున్నారా ?.. అయితే ఈ ఫోటోస్ చూడాల్సిందే.

అనుష్క శర్మ, దీపికా పదుకొణే, అనుష్క శెట్టి ముగ్గురు టాప్ హీరోయిన్స్. వీరంతా బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో చదువుకున్నారు. తాజాగా ఈ కాలేజీ ఇన్ స్టా ఖాతాలో వీరు ముగ్గురు కాలేజీలో చదువుకున్నప్పటి ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. అప్పటి ఈ హీరోయిన్స్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. దీపికా పదుకొణె 2004లో ఒక నాటకంలో నటించినప్పటికీ ఫోటోను షేర్ చేశారు. అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం నాటి ఫోటో. అలాగే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మరొక అమ్మాయితో నిలబడి కెమెరాకు నవ్వుతూ కనిపించాడు. ఈ ఫోటో 2006లో తీసిందట.

అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. చేతిలో ట్రంపెట్ పట్టుకుని కనిపించారు. తెల్లటి కుర్తా సెట్ లో క్యాప్ ధరించి ఉన్నారు. ఈ ఫోటో చూస్తే ఏదో ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ముగ్గురికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాహుబలి తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క శెట్టి.. ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయం అందుకుంది.

ఇక బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే ఇటీవలే ఫఠాన్, జవాన్ చిత్రాలతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఆమె హృతిక్ రోషన్ జోడిగా ఫైటర్ 3 చిత్రంలో నటిస్తుంది. అలాగే విరాట్ కోహ్లీతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది అనుష్క శర్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us