యాక్షన్, కామెడీ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ.. టాలీవుడ్లో మంచి విజయాలు దక్కించుకుంటున్న అనిల్ రావిపూడి.. తన చేయబోయే సినిమాల గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్3 చిత్రీకరణ సమయంలో కరోనా బారిన పడిన అనిల్ రావిపూడి ఇటీవలే కోలుకున్నారు. అనీల్ నెక్స్ట్ సినిమాగా నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తారని వార్తలు వినిపించాయి. అంతే కాదు మాస్ రాజా రవితేజతో ‘రాజాది గ్రేట్’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తారని.. లేదు మహేశ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారంటూ రీసెంట్గా నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకి హాజరైన అనిల్ రావిపూడి.. వీటన్నింటిక క్లారిటీ ఇచ్చారు. “”ఎఫ్3″తో ప్రేక్షకులను నవ్వించాలనేదే ప్రస్తుతం నా ఆలోచన. ఇప్పటికే ఈ సినిమా సగం పూర్తయ్యింది. ఇక బాలకృష్ణగారితో సినిమా అంటారా? అదొక డిఫరెంట్ జోనర్ మూవీ. అయితే మల్టీస్టారర్ మూవీ అని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు.” అని అనిల్ క్లారిటీ ఇచ్చాడు.
అలాగే త్రివిక్రమ్‌తో సూపర్ స్టార్ మహేశ్ సినిమా పూర్తయిన తర్వాత తన డైరెక్షన్లో సినిమా ఉంటుందని.. కానీ అది ‘సరిలేరు నీకెవ్వరు’ సీక్వెల్ కాదని చెప్పుకొచ్చాడు అనీల్. మారోవైపు రవితేజతో ‘రాజాదిగ్రేట్’ సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని.. అయితే ఎఫ్ 3 చేసిన నెల తర్వాతే మరో చేయబోయే మూవీ గురించి చెబుతానని.. అందరికీ క్లరిటీ ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :