నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలనీ అనిల్ రావిపూడి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. టాలీవుడ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ‘ఎఫ్2’ ముందు వరకూ అనిల్ రావిపూడి కేవలం మీడియం రేంజ్ ఉన్న హీరోలతో మాత్రమే పనిచేశాడు. స్టార్ ఇమేజ్ హీరోలను మ్యానేజ్ చెయ్యగలడా అనే డౌట్ అందరికీ వచ్చిన క్రమంలో మహేష్ బాబు తో ‘సరిలేరు నీకెవ్వరు’ తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. నిజానికి చాలా రోజుల క్రితమే బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో ఎప్పుడో మూవీ ఫైనలయ్యింది. కానీ ఇద్దరికీ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు. దీనికి త్వరలోనే ముహుర్తం కుదరబోతుందని అనిల్ ధీమాగా చెప్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవలే అనిల్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అనిల్.. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే నెలలో మైసూర్ లో ఓ షెడ్యూల్ షూటింగ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం.
తాజాగా అనిల్ బాలయ్య సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం 75 కోట్లు బడ్జెట్ ని కేటాయించనున్నారట. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. మరోవైపు బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయనున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :