Suma Kanakala: తల్లితో కొత్త ప్రోగ్రామ్‌ను ప్లాన్‌ చేస్తున్న సుమ..? అప్పటి వరకు ఎదురు చూడండి అంటూ పోస్ట్.

Suma Kanakala: సుమ కనకాల.. ఈ పేరు తెలియని సగటు బుల్లి తెర ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదోమో. యాంకరింగ్‌కు సరికొత్త అర్థం చెబుతూ...

Suma Kanakala: తల్లితో కొత్త ప్రోగ్రామ్‌ను ప్లాన్‌ చేస్తున్న సుమ..? అప్పటి వరకు ఎదురు చూడండి అంటూ పోస్ట్.
Suma

Updated on: Aug 29, 2021 | 6:59 PM

Suma Kanakala: సుమ కనకాల.. ఈ పేరు తెలియని సగటు బుల్లి తెర ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదోమో. యాంకరింగ్‌కు సరికొత్త అర్థం చెబుతూ స్టేజ్‌ అంతా సందడి చేస్తుంటారు సుమ. ఎప్పుడూ ఫుల్‌ ఎనర్జీతో అంతా తానై కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సుమది అందె వేసిన చేయి. అందుకే ఎంతో మంది కొత్త యాంకర్‌లు వచ్చినా సుమ స్థానాన్ని మాత్రం రీప్లేస్‌ చేయలేకపోతున్నారు. ఇక ఆడియో ఫంక్షన్‌ల నుంచి మొదలు పెడితే, ఇంటర్వ్యూల వరకు ఇలా సుమ సందడి చేస్తూనే ఉంటారు.

ఇక సుమ ఇటీవల సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా మారారు. తన ప్రోగ్రామ్‌ల గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్‌ చేస్తున్నారు. అయితే సోషల్‌ మీడియా పోస్టుల్లోనూ సుమ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా చూస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమై పోస్ట్‌ చేశారు.

సుమ అమ్మకు మేకప్‌ వేస్తున్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘త్వరలోనే మీరందూ పూర్తి వీడియోను చూడబోతున్నారు. అప్పటి వరకు వేచి ఉండండి’ అంటూ సస్పెన్స్‌ క్రియేట్‌ చేశారు. అయితే సుమ తన అమ్మతో ఏదైనా ప్రోగ్రామ్‌ చేయనుందా.? లేదా సుమ యాంకర్‌గా వస్తోన్న వంటల షోలో ఆమె తల్లి పాల్గొననుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే సుమ తదుపరి పోస్ట్‌ కోసం ఎదురు చూడాల్సిందే.

Also Read: Oliviak Morris: హైదరాబాద్ పానీపూరికి ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఫిదా.. వీధుల్లో సందడి చేసిన హాలీవుడ్ హీరోయిన్..

South India Actress: ఈమెని గుర్తించారా.. ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్.. వామ్మో ఎంత మార్పు..?

Megha Akash: వేదాంతం వల్లిస్తోన్న అందాల భామ.. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అంటూ..