Suma Kanakala: అనుకోని వివాదంలో చిక్కుకున్న సుమ కనకాల.. వివరణ ఇచ్చిన స్టార్ యాంకర్

ఇటీవల విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్‌ కాల్టగిరోన్‌ సుమ చేతికి ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సిట్యుయేషన్ ను కూడా తన సమయస్ఫూర్తితో ఎంతో సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి శభాష్ అనిపించుకుంది సుమ. ఇప్పుడు మరో వివాదంలో సుమ పేరు   వినిపిస్తోంది

Suma Kanakala: అనుకోని వివాదంలో చిక్కుకున్న సుమ కనకాల.. వివరణ ఇచ్చిన స్టార్ యాంకర్
Anchor Suma Kanakala
Follow us

|

Updated on: Aug 07, 2024 | 7:34 PM

స్టార్ యాంకర్‌ సుమ కనకాల ప్రస్తుతం టీవీ షోలు, సినిమా ఈవెంట్లతో బిజీ బిజీగా ఉంటోంది. అదే సమయంలో అనుకోకుండా కొన్ని వివాదాలల్లో చిక్కుకుంటోంది. ఇటీవల విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్‌ కాల్టగిరోన్‌ సుమ చేతికి ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సిట్యుయేషన్ ను కూడా తన సమయస్ఫూర్తితో ఎంతో సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి శభాష్ అనిపించుకుంది సుమ. ఇప్పుడు మరో వివాదంలో సుమ పేరు   వినిపిస్తోంది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన ఒక ప్రమోషనల్ యాడ్ లో ఆమె నటించడమే ఈ వివాదానికి కారణం. వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం కేంద్రంగా సాగుతున్న ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసిందని వార్తలొచ్చాయి. అయితే కొందరు బాధితులు సుమ ఫొటోలు, యాడ్స్ ను చూసే ఫ్లాట్స్ కొన్నామంటూ రోడ్డెక్కడం, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సదరు బాధితుల్లో కొందరు సుమకు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వివాదంపై సుమ కూడా స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేసింది.

రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఒక యాడ్‌లో నేను గతంలో నటించాను. అయితే అది 2016-2018 వరకు మాత్రమే టెలికాస్ట్‌ చేసేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ తర్వాత ఆ ప్రకటనలు రద్దు చేసినట్లు తెలిసింది. కానీ ఇప్పుడు మా అనుమతి లేకుండా ఇంకా ఆ యాడ్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించి కొందరు బాధితులు నాకు లీగల్‌ నోటీసులు పంపారు. వారికి నేను సమాధానమిచ్చాను. అలాగే ఆ సంస్థకు కూడా నోటీసులు పంపాను. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లేదా ప్రమోషన్ అలాగే వీడియోలు అఫీషియల్ చానల్స్ నుంచి వస్తే మాత్రమే నమ్మాలి. వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన వారిందరికీ ధన్యవాదాలు’ అంటూ ఈ లేఖలో రాసుకొచ్చింది సుమ కనకాల. మరి సుమ వివరణతో ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

 యాంకర్ సుమ విడుదల చేసిన లేఖ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.