Tollywood: ప్రపంచం మెచ్చిన డైరెక్టర్.. పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేసిన దర్శకుడు.. ఎవరో గుర్తుపట్టారా..?

పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పాన్ ఇండియా సినీ పరిశ్రమలో చాలా స్పెషల్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన నటీనటులు ఒక్కసారైన అతడి డైరెక్షన్లో నటించాలనుకుంటారు. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: ప్రపంచం మెచ్చిన డైరెక్టర్.. పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేసిన దర్శకుడు.. ఎవరో గుర్తుపట్టారా..?
Rajamouli
Follow us

|

Updated on: Aug 07, 2024 | 7:00 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పాన్ ఇండియా సినీ పరిశ్రమలో చాలా స్పెషల్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన నటీనటులు ఒక్కసారైన అతడి డైరెక్షన్లో నటించాలనుకుంటారు. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.. ? అతడే దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా దిశను మార్చిన దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి నిస్సందేహంగా ఒకరు. తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు. స్టూడెంట్ నెం.1 సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన జక్కన్న ఇప్పటివరకు ఒక్కసారి పరాజయాన్ని చవిచూడలేదు. సింహాద్రి, చత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఈగ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న జక్కన్న.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమాలపై ఆసక్తి చూపించింది.

ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు మూవీ ఖ్యాతిని మరింత పెంచాడు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నాడు. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా బాహుబలి అన్ని రికార్డ్స్ అందుకుంది. అలాగే ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కలగా మిగిలిపోయిందనుకున్న ఆస్కార్ అవార్డును అందుకుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను హాలీవుడ్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్ మరింత స్టైలీష్ లుక్ లో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపించనున్నాడు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ రాజమౌళి సినీ కెరీర్ ఆధారంగా ఓ డాక్యూమెంటరీని రూపొందిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. మోడరన్ మాస్టర్స్: SS రాజమౌళి అనే డాక్యుమెంటరీని అప్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ నిర్మించాయి. రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కెమరూన్, జో రుస్సో, కరణ్ జోహార్, ప్రభాస్, రానా దగ్గుబాటి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.