కుర్రకారుకు సెగలు రేపుతున్న యషిక స్టన్నింగ్ స్టిల్స్

Phani CH

07 AUG 2024

కోలీవుడ్ బ్యూటీ యషికా ఆనంద్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.  2018లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘నోటా’ సినిమాలో ఈమె ఓ యంగ్ పొలిటీషియన్ గా నటించింది. 

ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కాబట్టి టాలీవుడ్లో ఈమెకు ఆఫర్లు రాలేదు. ఇదిలా ఉండగా.. 2021 జూలై 25న యషికాకి భయంకరమైన యాక్సిడెంట్‌ జరిగింది. 

తన స్నేహితులతో కలిసి రాష్ డ్రైవింగ్ కారణంగా ఈమె మమల్లాపుర ఏరియాలోని సులేరికాడు వద్ద పెద్ద యాక్సిడెంట్ కు గురైంది. ఆ కేసు విషయమై ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.

బిగ్‌ బాస్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యషిక. బిగ్‌ బాస్‌ సీజన్‌ 2(తమిళం)లో పాల్గొని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత తరచూ గెస్ట్ గా షోలో మెరుస్తూనే ఉంది. 

దీంతోపాటు టీవీ షోస్‌, సిరీస్‌లలో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో సర్వైవింగ్‌ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

`నోటా` బ్యూటీ యషికా ఆనంద్‌ స్పెషల్‌ సాంగ్స్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఈ అమ్మడికి నటిగా కంటే ఐటెమ్‌ సాంగులే బాగా గుర్తింపు తెచ్చాయి. క్రేజ్‌ని తీసుకొచ్చాయి. 

 అందుకే ఈ భామ వాటికే ప్రయారిటీ ఇస్తుంది. నటిగా అడపాదడపా మెరుస్తుంది. అందాల విందుతో అలరిస్తుంది. తాజాగా ఈ భామ గ్లామర్‌ ట్రీట్‌ తో రెచ్చిపోయింది.