Anchor Suma: నాకు తెలుగు నేర్పించింది.. పెళ్లి చేసింది ఆయనే.. ఆ డైరెక్టర్‌ గురించి గొప్పగా చెప్పిన యాంకర్ సుమ

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల రీసెంట్ గా ఒక టాక్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో రాజీవ్ నటుడు రాజీవ్ కనకాలతో పెళ్లి గురించి ఓపెన్ గా మాట్లాడింది.

Anchor Suma: నాకు తెలుగు నేర్పించింది.. పెళ్లి చేసింది ఆయనే.. ఆ డైరెక్టర్‌ గురించి గొప్పగా చెప్పిన యాంకర్ సుమ
Anchor Suma Kanakala

Updated on: Nov 22, 2026 | 12:02 PM

ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ యాంకర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ కనకాల. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా ఈవెంట్, ఫంక్షన్ జరిగినా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. మాటలతో మాయ చేసే సుమ యాంకరింగ్ వల్లే సినిమా ఈవెంట్లు గ్రాండ్ సక్సెస్ అవుతుంటాయి. కేరళలో పుట్టి పెరిగినా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. పంచులు, ప్రాసలతో ఆడియెన్స్ ను కట్టి పడేస్తుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ సినిమా ఈవెంట్లకు సుమనే యాంకరింగ్ గా తీసుకుంటారు. ప్రస్తుతం టీవీ షోస్, సినిమా ఈవెంట్లతో నిత్యం బిజీ బిజీగా ఉంటోందీ యాంకరమ్మ. అయితే తాజాగా ఆమె ఓ కార్యక్రమానికి హాజరైంది. అన్‌మ్యూట్ విత్ సుమ అనే ప్రోగ్రామ్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానాలిచ్చింది. ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘స్వతహాగా నేను మలయాళీ అమ్మాయినే. అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడడం నా అదృష్టం. నాకు తెలుగు భాషతో పాటు అనేక భావాలు నేర్పించిన వ్యక్తి బ్రిమ్‌ గారే. ఆ తర్వాత నా లైఫ్‌లో బ్రిమ్ దొరకడం ఓ వరం. నా కెరీర్ ప్రారంభంలో నేను తెలుగు మాట్లాడితే నవ్వేవారు. తెలుగులో సామెతలు, ఎన్నో చమత్కారాలు బ్రిమ్ వల్లే నేర్చుకున్నాను. నేను బ్రిమ్ సార్ డైరెక్ట్ చేసిన అర్చన , సమత , రావోయి చందమామ వంటి సీరియల్స్‌లో నటించాను. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక చమత్కారం ఉంటుంది. ఇక రాజీవ్ కనకాలతో నా పెళ్లి చేసింది కూడా ఆయనే. అలా బ్రిమ్ పెళ్లిళ్ల పేరయ్యగా కూడా మారిపోయారు’ అని సరదాగా చెప్పుకొచ్చింది సుమ. ప్రస్తుతం ఈ యాంకరమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా ప్రమోషన్లలో యాంకర్ సుమ కనకాల..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us