Anchor Suma Arrest: ప్రముఖ యాంకర్‌ సుమ అరెస్ట్.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫొటోలు

|

Apr 13, 2023 | 1:05 PM

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి తెలయని తెలుగువాళ్లుండరు. టీవీ షోలు, సినిమా ఫ్రీరిలీజ్‌ ఈవెంట్లు, గేమ్ షోలు, సెలబ్రెటీల ఇంటర్వ్యూలు.. ఇలా వరుస ప్రోగ్రాములతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటారు. టీవీ ప్రోగ్రాంలతో సరిపెట్టుకోకుండా అడపాదడపా వెండి తెరపై కూడా మెరుస్తున్నారు. ఏ మువీ ఈవెంట్‌ అయినా..

Anchor Suma Arrest: ప్రముఖ యాంకర్‌ సుమ అరెస్ట్.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫొటోలు
Anchor Suma Arrest
Follow us on

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి తెలయని తెలుగువాళ్లుండరు. టీవీ షోలు, సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు, గేమ్ షోలు, సెలబ్రెటీల ఇంటర్వ్యూలు.. ఇలా వరుస ప్రోగ్రాములతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటారు. టీవీ ప్రోగ్రాంలతో సరిపెట్టుకోకుండా అడపాదడపా వెండి తెరపై కూడా మెరుస్తున్నారు. ఏ మువీ ఈవెంట్‌ అయినా యాంకర్‌గా ఎవరైతే బాగుంటుందనే చర్చ జరిగితే.. మొదట మదిలో మెదిలే పేరు సుమ. అంతలా గుర్తింపు తెచ్చుకుంది ఈ మలయాళీ కుట్టి. తెలుగు భాషపై పట్టు, అన్నింటికీ మించి చక్కని వాక్‌ చాతుర్యంతో ప్రతిఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఐతే ఏం జరిగిందో తెలియదు గానీ తాజాగా సుమ చేతికి బేడీలు వేసి వ్యాన్‌లో తీసుకెళ్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో సుమకు ఏమైంది? ఏంజరిందంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. సుమ అరెస్ట్‌ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఇదంతా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంమని తెలిశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

యాంకర్ సుమ ఇటీవల హీరో అల్లరి నరేష్‌ను ఇంటర్వ్యూ చేశారు. అల్లరి నరేష్ తాజా చిత్రం ‘ఉగ్రం’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కేవలం కామెడీ సినిమాలే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను కూడా అల్లరి నరేష్‌ చేస్తున్నారు. ‘నాంది’, ‘ఇట్లు మారేడుపల్లి నియోజకవర్గం’, ‘మహర్షి’ వంటి సినిమాల్లో నరేష్ నటన చూస్తే అవగతమవుతుంది. ఇప్పుడు ‘ఉగ్రం’ తో మరోసారి కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నరేష్. ‘నాంది’ సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అందరి హీరోలు మాదిరిగానే హీరో నరేష్ కూడా ముందునుంచే సినిమా ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు. ఇదంతా తన కొత్త మువీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిందని తెలుస్తోంది. ఉగ్రం మువీలో నరేష్ సీఐ శివకుమార్‌గా నటిస్తున్నారు. అందులో భాగంగానే యాంకర్ సుమ నరేష్‌ను ఇంటర్వ్యూ చేసింది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.