Anchor Pradeep: బుల్లితెర, వెండి తెరపై తనదన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న యాంకర్ ప్రదీప్ తాజాగా ఓ వివాదంలో ఇరుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంటన్నదానిపై ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. దీంతో ప్రదీప్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ.. ఎవ్వరిని కించపర్చాలని ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఒక కార్యక్రమంలో సిటీపేరు చెప్పి దాని రాజధాని ఏదని అడిగానని.. నేను అడిగిన ప్రశ్న తప్పు అనికాకుండా అవతలి వ్యక్తి వేరే సమాధానం ఇవ్వడం తో వివాదం ఏర్పడిందని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. ఇక తనవల్ల ఎవైరా ఇబ్బంది పడి ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదంటూ.. ప్రదీప్ వివరణ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే.. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రదీప్ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే.. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోని.. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ క్షమాపణలు చెప్పి వివాదానికి చెక్ పెట్టారు.
Samantha Akkineni: వ్యాపార రంగంలోకి స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారి కోడలు మరో అడుగు..