Anasuya: వెండితెరపై దూసుకుపోతున్న అందాల యాంకరమ్మ.. మరో స్పెషల్ సాంగ్‏లో అనసూయ..

అనసూయ.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ అందాల యాంకరమ్మకు అటు సోషల్ మీడియాలో..

Anasuya: వెండితెరపై దూసుకుపోతున్న అందాల యాంకరమ్మ.. మరో స్పెషల్ సాంగ్‏లో అనసూయ..
Anasuya

Edited By: Anil kumar poka

Updated on: Oct 12, 2021 | 5:10 PM

అనసూయ.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ అందాల యాంకరమ్మకు అటు సోషల్ మీడియాలో.. ఇటు బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. టాప్ యాంకర్స్‏లలో ఒకరిగా కొనసాగుతున్న అనసూయ.. ఇటు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. అనసూయకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. రంగమ్మాత్త పాత్రలో ఒదిగిపోయి అందరికి ఆకట్టుకుంది అనసూయ. ఈ సినిమా అనంతరం వెండితెరపై అనసూయ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పలు చిత్రాల్లో కీలక పాత్రలలో నటించడమే కాకుండా.. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్‏లోనూ దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అనసూయ మరో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ.. చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు రవితేజ. క్రాక్ సినిమా ఇచ్చిన జోష్‏లో వరుస ప్రాజెక్ట్స్ లను పట్టాలెక్కించాడు మాస్ మాహారాజా. ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్న రవితేజ.. అలాగే డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లుగా టాక్. ఇందుకు అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తివివరాలతో కూడిన అధికారిక ప్రకటన రానుందట. మొత్తానికి వెండితెరపై అనసూయ హవా మాత్రం తగ్గడం లేదు.

Also Read: Maa Elections 2021: ఎలక్షన్స్ రోజున శివ బాలాజీ చెయ్యి కొరికిన హేమ.. శివబాలాజీ భార్య సంచలన వ్యాఖ్యలు..

Vanitha Vijay Kumar: సమంతకు పెరుగుతున్న మద్దతు.. రంగంలోకి దిగిన వనితా విజయ్ కుమార్.. ఏమన్నదంటే..

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఈవారం నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరంటే..