Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ పుష్ప లో గిరిజన యువతిగా నటిస్తుందని తెలుస్తుంది. ఆగస్టు 13న రిలీజ్ డేట్ అనుకున్నా.. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనన్న క్లారిటీకొచ్చేశారు మేకర్స్. సేమ్ టైం… సినిమా కంటెంట్ విషయంలో కూడా మేజర్ డెసిషన్ తీసుకున్నారట. పుష్ప1 అండ్ పుష్ప2.. ఇలా సినిమాను రెండు భాగాలుగా విడగొట్టాలన్నది సుక్కూ వేసిన న్యూ ఐడియా అని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటివరకు 70 పర్సెంట్ షూటింగ్ ముగిసిందని… ఆ రషెస్ తో ఫస్ట్ పార్ట్ ని కంక్లూడ్ చేసి ఆక్టోబర్ 13న రిలీజ్ చేయాలన్నది తాజా ప్లాన్ అట. మిగతా పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేసేలా స్కెచ్ రెడీ చేశారని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రలో అందాల యాంకర్ అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆమధ్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’లో ఆమె చేసిన ‘రంగమ్మత్త’ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. అంతలా మెప్పించింది అనసూయ. ‘పుష్ప’ సినిమాలోనూ ఆమెకి మంచి పాత్ర పడింది. అనసూయ ఈ సినిమా షూటింగులో పాల్గొంది కూడా. అయితే ఇప్పుడు సినిమాలో అనసూయ పాత్ర నిడివిని పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. మొదటిభాగంలోను .. రెండవ భాగంలోను ఆమె కనిపిస్తుందన్న మాట. అయితే కొద్దిరోజుల చిత్రీకరణ అనంతరం కోవిడ్ ఉధృతి వల్ల సెట్లో బన్నీకి కోవిడ్ సోకడంతో షూటింగ్ ని వాయిదా వేశారు. బన్ని కోవిడ్ కి చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే. తాజా చిట్ చాట్ లో అనసూయ మాట్లాడుతూ పుష్ప సెట్లో ఉన్న నాలుగు రోజుల్లోనే అల్లు అర్జున్ వ్యక్తిత్వంతో ప్రేమలో పడిపోయానని అంటున్నారు. బన్ని చేసే పని పట్ల నిబద్ధత అంకితభావం కలిగి ఉన్న స్టార్ అని చెప్పుకొచ్చింది అనసూయ. రెండవ సారి సుకుమార్ తో పని చేస్తున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుందని అంటుంది అనసూయ.
మరిన్ని ఇక్కడ చదవండి :