Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్య పాండే జంటగా రూపొందుతోన్న చిత్రం 'లైగర్‌'. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..

Updated on: Nov 25, 2021 | 4:02 PM

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్య పాండే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్‌’. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూరి, ఛార్మీకౌర్‌, కరణ్‌జోహార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. అదేవిధంగా బాక్సింగ్ దిగ్గజం మైక్‌ టైసన్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా మైక్‌ టైసన్‌ తో సన్నివేశాల చిత్రీకరణ కోసం ‘లైగర్’ టీం ఇటీవల లాస్‌వేగాస్‌లో వాలిపోయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా అక్కడి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ విషయాన్ని అనన్యా పాండే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

కాగా లాస్‌ వేగాస్‌లో విజయ్- మైక్ టైసన్ ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక షూటింగ్ సమయంలో విజయ్, అనన్య, ఛార్మి తమ సోషల్ మీడియాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇక విజయ్‌, పూరీలు కలిసి లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ను భాగానే ఎంజాయ్‌ చేసినట్లు వారి సోషల్‌ మీడియా ఫొటోలే చెబుతున్నాయి. అక్కడి రెస్టారెంట్లతో పాటు కొన్ని అందమైన లొకేషన్స్‌లో వీరు ఫోటోలు దిగారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Also Read:

Funny Video: నాగినిగా మారిన అందాల బామ.. క్రేజీ వీడియోలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ పై సంచలన కామెంట్స్ చేసిన సిరి మదర్.. నాకు నచ్చడం లేదు అంటూ..

John Abraham: అమితాబ్‌ షోలో కన్నీళ్లు పెట్టుకున్న యాక్షన్‌ హీరో.. ఎందుకంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us