ఆనందం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. అలాగే యువతను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రేఖ వేదవ్యాస్ అప్పటి కుర్రకారును తన నటనతో అందంతో కట్టిపడేసింది. ఆనందం సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది ఈ భామ. తెలుగు సినిమాల్లో నటించింది తక్కువే అయినా కన్నడ భాషలో చాలా సినిమాల్లో నటించింది రేఖ
అయితే రేఖ ఇప్పుడు ఎలా ఉంది అని చాలా మంది సోషల్ మీడియాలో గాలించేస్తున్నారు. అప్పుడు మెరుపుతీగలా ఉన్న రేఖ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? తెలుగులో రేఖ చివరిగా నటించిన సినిమా మేధావి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఇక ఇప్పుడు ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది రేఖ పోలీకలన్నీ మారిపోయాయి. అందంగానే ఉంది కానీ అప్పటిలా మాత్రం లేదు. ఇప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతోంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. అందంతో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచేసింది ఈ బ్యూటీ.