గత వారం రోజులుగా సోషల్ మీడియాలో కల్కి 2898 ఏడీ సినిమా గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఇటీవల భైరవ బుజ్జిని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల బుజ్జి కోసం భారీ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్లో అభిమానులకు పరిచయం చేసేందుకు బుజ్జిని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చాడు ప్రభాస్. డిఫరెంట్ లుక్లో స్టైలీష్ గా ఉన్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించిన బుజ్జి కారుకు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. దీంతో కల్కి ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ఇంకెన్ని విభిన్న వాహనాలు ఉంటాయి ?.. అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుజ్జికి సంబంధించిన స్పెషల్ వీడియో నెట్టింట వైరలవుతుంది. బుజ్జి కారు స్పెషాలిటీస్ పరిచయం చేస్తూ ఉన్న వీడియో ఆకట్టుకుంటుంది.
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. గతంలో నాగ్ అశ్విన్ పెట్టి ట్వీట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ.. “నిజానికి సరదా సంగతులు ట్విట్టర్ లోనే కనిపిస్తాయి. నాగ్ అశ్విన్.. అతడి టీమ్ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాహనాలు తయారు చేయడంలో కల్కి చిత్రయూనిట్ చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ సహయపడుతుంది. బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఇ- మోటర్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది ” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ‘సాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారు. ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇవ్వగా.. ‘కలలు కనడం మానొద్దు.. ‘ అంటూ మహీంద్రా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్టర్ ముచ్చట నెట్టింట వైరలవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కి చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Fun stuff does, indeed, happen on X …
We’re so proud of @nagashwin7 and his tribe of filmmakers who aren’t afraid to think big…and I mean REALLY big..
Our team in Mahindra Research Valley in Chennai helped the Kalki team realise its vision for a futuristic vehicle by… pic.twitter.com/yAb47nx7ut
— anand mahindra (@anandmahindra) May 23, 2024
Don’t ever stop dreaming… https://t.co/NNmjFRGwHj
— anand mahindra (@anandmahindra) May 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.