మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం రిలీజ్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ మరింత అంచనాలు క్రియేట్ చేస్తుండగా.. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మరోసారి ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడనే క్యూరియాసిటీ కూడా నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈచిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఈసారి పుష్ప 2లో మరికొంత మంది నటీనటులు కూడా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది.
ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప 2 కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మరో 50 రోజుల్లోనే ఈ మూవీ రిలీజ్ కానుందని.. ఈ విషాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన నయా పోస్టర్ అదిరిపోయింది. అందులో అల్లు అర్జున్ కుర్చీలో కూర్చోని పిడికిలి బిగించి చాలా సిరీయస్ గా కనిపిస్తున్నాడు.
ఇది చదవండి : Devara Movie: సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న ‘దేవర’ సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..
ప్రస్తుతం పుష్ప 2 కొత్త పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రాన్ని చూసేందుకు వెయిటింగ్ అంటూ బన్నీ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
The wait gets shorter. 50 days to witness Pushpa Raj and his blockbuster rule ❤🔥#Pushpa2TheRule will be A NEW ERA OF INDIAN CINEMA 🔥
THE RULE IN CINEMAS on 6th DEC 2024.#50DaysToPushpa2Storm 🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP… pic.twitter.com/0tVnORo5II
— Mythri Movie Makers (@MythriOfficial) October 17, 2024
ఇది చదవండి : OTT Movie: ధైర్యమునోళ్లే చూడండి.. సీను సీనుకు గుండె ఆగాల్సిందే.. ఈ హరర్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.