అల్లు అర్జున్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం (డిసెంబర్ 09)లో హైదరాబాద్ లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల, సుకుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ఇవాళ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.పుష్ప 1,2 రెండూ కలిపి ఈ సినిమా కోసం ఐదేళ్లు పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇక మై ఫ్యాన్స్.. ఐ లవ్యూ.. ఐలవ్యూ.. నా అభిమానుల కోసం నేను ఏమైనా చేస్తాను.. ఇంతకంటే ఏమీ చెప్పలేను’
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.