Allu Arjun Pushpa Movie: ఫ్యాన్ మెడెడ్ పోస్టర్ కు ఫిదా అయిన ఐకాన్ స్టార్.. గ్రాఫిక్స్ పిక్ ను షేర్ చేసిన బన్నీ ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గంధపు  చక్కల

Allu Arjun Pushpa Movie: ఫ్యాన్ మెడెడ్ పోస్టర్ కు ఫిదా అయిన ఐకాన్ స్టార్.. గ్రాఫిక్స్ పిక్ ను షేర్ చేసిన బన్నీ ..

Updated on: May 06, 2021 | 8:54 AM

Allu Arjun Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు మన ఐకాన్ స్టార్. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అనసూయ, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఇక పుష్పలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి చాలా వరకూ షూటింగు కానిచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.

సునీల్ – అనసూయ కాంబినేషన్ లో కొన్ని సీన్స్.. ఫహద్ ఫాజిల్ పాల్గొనే సన్నివేశాలని ఇప్పటికే తెరకెక్కించారు. తర్వాత డేట్స్ సమస్య వస్తుందేమో అని భావించి రిస్క్ అయినా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్ కొనసాగించారు. ఇటీవల బన్నీ కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నారు దాంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా పుష్ప  సంబంధించిన గ్రాఫిక్స్ పోస్టర్ ను బన్నీ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన అభిమాని డిజైన్ చేసిన ఈ పోస్టర్ బన్నీ కి తెగ నచ్చేసిందంట.. దాంతో ఆ పోస్టర్ ను షేర్ చేస్తూ.. ఆ అభిమానికి కృతజ్ఞతలు తెలిపాడు ఐకాన్ స్టార్.

మరిన్ని ఇక్కడ చదవండి :

రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..

గరిటపట్టిన బన్నీ డాటర్.. నాన్న కోసం స్పెషల్‏గా దోశ వేసిన అర్హ.. ఎప్పటికీ మర్చిపోలేనంటున్న అల్లు అర్జున్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us