
ఇటీవల ఆంద్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే పేలుడు ప్రమాదంలో కడింపల్లి దుర్గ దుర్గ అనే మానసిక దివ్యాంగురాలు తన తండ్రిని కోల్పోయింది. అంతకు ముందే ఆమె తల్లి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో దుర్గ ఒంటరిగా మిగిలిపోయింది. మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన మృతి చెందడంతో దుర్గకు అన్నం పెట్టే వారు కూడా లేరని చాలా మంది చలించిపోతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న దుర్గ దీన గాథ అభిమానులు, సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ కు చేరింది.ఈ క్రమంలో అనాథలా మిగిలిపోయిన మానసిక దివ్యాంగురాలి పరిస్థితిని చూసి చలించిపోయాడు బన్నీ. ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో దుర్గ సంరక్షణ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు. నెలకు రూ.7,500 చొప్పున జీవితాంతం దుర్గ బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేశాడు.
అల్లు అర్జున్ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు వేట్లపాలెం గ్రామానికి వెళ్లి దుర్గను స్వయంగా కలిశారు. ఆమెకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆ బాలికకు ఈ ఆర్థిక సాయం ఎంతో భరసా నిస్తుందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మాయికి జీవితాం ఆర్థిక భరోసా నిచ్చిన అల్లు అర్జున్ రియల్ హీరోనంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.
Hero #AlluArjun once again showed his big heart ❤️
After learning about the tragic fire accident at a fireworks factory in Kakinada district that claimed her father’s life, he extended support to mentally challenged girl Kadimpalli Durga.
He announced that ₹7,500 will be… pic.twitter.com/34q252I8FN
— Milagro Movies (@MilagroMovies) March 10, 2026
#AlluArjun supports Durga,a victim of Vetlapalem:
Hero Allu Arjun will provide financial support of Rs 7500 per month to Durga,a mentally challenged woman, for the rest of her life❤️
Durga, who lost her father in the recent fire accident in Vetlapalem,Kakinada,was left an orphan. pic.twitter.com/031NS1mtYS— PopCorn Timez (@PopCornTimez) March 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.