Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ముంబైకు షిఫ్ట్ అవుతున్నారా? క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి గత కొన్ని గంటలుగా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతోన్న బన్నీ హైదరాబాద్ ను వదిలేసి ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై అల్లు అరవింద్ స్పందించారు.

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ముంబైకు షిఫ్ట్ అవుతున్నారా? క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్
Allu Arjun Family

Updated on: Apr 21, 2026 | 1:09 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌  హైదరాబాద్ విడిచి పెట్టనున్నాడని, తన కుటుంబంతో కలిసి ముంబైలో స్థిరపడనున్నారని గత కొన్ని గంటలుగా నెట్టింట బాగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై కొన్ని పత్రికలు, వెబ్ సైట్లలో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీంతో అల్లు అర్జున్‌ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారన్నది ఈ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అల్లు అర్జున్ ముంబైకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. ‘బన్నీ కొత్త సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం ముంబైలో జరుపుకుంటున్నందున చాలామందికి అలా అనిపించిఉండవచ్చు. కానీ, అర్జున్‌ మనసు ఎప్పుడూ హైదరాబాద్‌ చుట్టే ఉంటుంది. అతనికి ఇక్కడే సొంత ఇల్లు ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. తన స్నేహితులందరూ హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. అలాంటప్పుడు అతను ముంబైకి ఎందుకు వెళ్తారు..? ముంబైలో స్థిరపడాలనే ప్రణాళికలు బన్నీకి లేవు. అయితే, ప్రస్తుతం షూటింగ్‌ పనుల వల్ల ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్నాడు.’ అని అరవింద్‌ చెప్పుకొచ్చారు.

కాగా పుష్ప2 వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం రాకా. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సంస్థ సుమారు 800 కోట్ల బడ్జెట్ తో రాకా సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు బన్నీ.

ఇవి కూడా చదవండి

రాకా సినిమాలో అల్లు అర్జున్..

అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us