మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

నటుడు అల్లరి నరేష్ త్వరలో రంభ ఊర్వశి మేనక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన విజయాలు, అపజయాలపై ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. కేవలం కామెడీకే పరిమితమైతే బోర్ కొడుతుందని, ఒక నటుడిగా గుర్తింపు రావాలంటే గమ్యం వంటి చిత్రాలు చేయాలని పేర్కొన్నారు.

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
Allari Naresh

Updated on: Sep 03, 2026 | 1:21 PM

అల్లరి నరేష్  త్వరలో రంభ ఊర్వశి మేనకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, చిత్రాల ఎంపిక, వ్యక్తిగత అభిరుచులపై మనసు విప్పి మాట్లాడారు. “భలే భలే మగాడివోయ్” చిత్రాన్ని తిరస్కరించారన్న వదంతులపై ఆయన స్పష్టత ఇచ్చారు. దర్శకుడు మారుతిని తాను కలిసింది నిజమే అయినప్పటికీ, అది “భలే భలే మగాడివోయ్” కథ కోసం కాదని, వేరే స్క్రిప్ట్ గురించి చర్చలు జరిగాయని నరేష్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాని నటించి విజయం సాధించినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని, నాని కెరీర్‌కు అది మంచి మలుపు అని అభినందించారు. అయితే, హాస్యభరితమైన అలాంటి సినిమాను చేయలేకపోయినందుకు కొంత ఫీలింగ్ ఉందని అన్నారు నరేష్. అలాగే ఏదైనా సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ఇప్పుడు అంతగా కలగడం లేదు. సుడిగాడు చిత్రం తర్వాత అటువంటి బలమైన అనుభూతి రాలేదు,” అని నరేష్ అన్నారు.

మరో హీరోయిన్ అయితే నావల్ల కాదు అని చేతులెత్తేసేది.. కానీ ఆమె అలా కాదు

కొన్ని సినిమాలు చూడటానికి బాగుంటాయని, కానీ రీమేక్ చేయడానికి సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఒక సినిమాను చేయలేకపోయినందుకు మాత్రం చాలా ఫీల్ అయ్యానని, అది సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన “7/G బృందావన కాలనీ” అని వెల్లడించారు. సెల్వరాఘవన్ తన మంచి మిత్రుడని, “కాదల్ కొండే” చిత్రం సమయంలో తనతో కలిసి పనిచేయాలనుకున్నారని, కానీ దురదృష్టవశాత్తు అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు.

నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

అల్లరి నరేష్ తన దినచర్య గురించి మాట్లాడుతూ, షూటింగ్‌లు లేనప్పుడు ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి కథలు వింటానని, లంచ్ తర్వాత కొంత సమయం తన అన్నయ్య కొడుకుతో ఆడుకుని, మళ్లీ సాయంత్రం ఆఫీసు పనులలో నిమగ్నమవుతానని తెలిపారు. ఫిట్‌నెస్ విషయంలో తాను జిమ్ ఫ్రీక్ కాదని, వెయిట్ లిఫ్టింగ్‌లు చేయనని, కేవలం బేసిక్, ఫ్లెక్సిబుల్ ఎక్సర్‌సైజ్‌లు మాత్రమే చేస్తానని వివరించారు. కామెడీ నటులు కండలు పెంచి గట్టిగా ఉండటం కంటే, శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని రాజేంద్ర ప్రసాద్ గారి ఉదాహరణతో పేర్కొన్నారు. తాను పెద్ద ఫుడీనని, డైట్ కట్టుబాట్లు పాటించనని, నచ్చింది తింటానని నరేష్ నవ్వుతూ చెప్పారు. రోడ్డు పక్కన బండ్లపై దొరికే ఆహారాన్ని ఎంతో ఇష్టపడతానని, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లోని కలింగ మండపం ఎదురుగా ఉండే చైనీస్ బండి సూప్ తన ఫేవరెట్ అని వెల్లడించారు. రామబండి, దోసె బండి, ఇడ్లీ బండ్ల వద్ద కూడా తరచుగా తింటానని, పాతబస్తీలోని మదీనా, బార్కాస్ వంటి ప్రదేశాలలో క్యాప్ పెట్టుకుని ఎవ్వరికీ తెలియకుండా బిర్యానీ, మండీలు ఆరగించడానికి వెళ్తానని సరదాగా పంచుకున్నారు నరేష్ .

ఇవి కూడా చదవండి

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us