Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‏కు సర్వం సిద్ధం.. సాయంత్రం ఒంగోలులో బాలయ్య సందడి..

|

Jan 06, 2023 | 7:46 AM

వీరసింహా రెడ్డి రాకతో ఫుల్ జోష్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ నిన్నటి వరకు ఈ వేడుకపై అనేక సందేహాలు ఉన్నాయి. అటు పోలీసుల అనుమతిపై అనుమానాలు ఉన్నాయి.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‏కు సర్వం సిద్ధం.. సాయంత్రం ఒంగోలులో బాలయ్య సందడి..
Nandamuri Balakrishna
Follow us on

నందమూరి నటసింహం బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న చిత్రం వీర సింహా రెడ్డి. మాస్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్స్ తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో వీరసింహా రెడ్డి రాకతో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ నిన్నటి వరకు ఈ వేడుకపై అనేక సందేహాలు ఉన్నాయి. అటు పోలీసుల అనుమతిపై అనుమానాలు ఉన్నాయి.

ఇప్పుడు ఎలాంటి అవరోధాలు లేవు. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్‌ గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. విడుదలకు ముందు నందమూరి ఫ్యాన్స్‌లో జోష్ నింపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌ను కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేసింది శ్రేయస్ మీడియా. ప్రోగ్రాం సౌత్ వైపు ఈవెంట్‌ మెయిన్‌ డయాస్‌ ఉంటుంది. ఎదురుగా 100 అడుగుల వరకు విఐపిలు, ఆ తరువాత 10 అడుగుల మేర బారికేడ్లు, తరువాత అభిమానులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే నిబంధనలు పాటిస్తూ.. ప్రోగ్రాం నిర్వహించాలని చెప్తున్నారు పోలీసులు. వాహనదారులు రూల్స్ పాటించకపోతే జాతీయ రహదారిపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తమ సూచనల మేరకు పార్కింగ్ చేసుకోవాలన్నారు ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్‌పి నాగేశ్వరారావు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఫ్రీ రిలీజ్ వేడుకకు అనుమతినిచ్చారు పోలీసులు. ఈ వేడుకకు 28,500 కెపాసిటీకి అనుమతించారు.

ఇవి కూడా చదవండి

ఇదంతా ఒక ఎత్తైతే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆహా అన్‌స్టాపబుల్‌ సీజన్‌2తో దూకుడు మీదున్నారు బాలకృష్ణ. చంద్రబాబుతో ఇంటర్వ్యూ మొదలు, పవన్, ప్రభాస్‌.. ఇలా అగ్ర తారలతో ఇంటర్వ్యూలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను షేక్‌ చేస్తున్నాయి. ఈ సమయంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వీరసింహారెడ్డి. సంక్రాంతికి పండుగ చేస్కోండి ఫ్యాన్స్ అంటున్నారు నిర్మాతలు. అయితే ఇవాళ్టి ఈవెంట్‌ ఎలా ఉండబోతుంది? అందులో బాలకృష్ణ ఏం మాట్లాడబోతున్నారు? రాజకీయంగా కీలక కామెంట్స్ ఉంటాయా? తాజా రాజకీయ పరిణామాలపై ఏ విధంగా స్పందిస్తారానేది హాట్‌ టాపిప్‌గా మారింది. జరిగేది ప్రీ రిలీజ్ వేడుక కావచ్చు, అది సినిమా ఫంక్షన్ కావచ్చు, అయినా బాలయ్య స్పీచ్‌పై ఆసక్తి నెలకొంది.