
Love Story Movie Update: అక్కినేని అభిమానులకు బ్యాడు న్యూస్.. అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్ చిత్రం లవ్ స్టోరీ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు దర్శకనిర్మాతలు.. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. AMB మాల్లో ప్రెస్ మీట్ నిర్వహించిన లవ్ స్టోరీ చిత్రయూనిట్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగ చైతన్య,నిర్మాతలు నారాయణ దాస్ నారాంగ్ సునీల్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు పాల్గొన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… సినిమా బాగా వచ్చింది. ఫైనల్‌గా రిలీజ్ చేయాలనుకునే సరికి మళ్లీ కొవిడ్ విజృంభిస్తోంది. పరిస్థితి చక్కబడిన తరువాత లవ్ స్టోరీ సినిమాను విడుదల చేస్తాము. మేము సినిమా విడుదల చేయడానికి రెడీగానే ఉన్నాము అని అన్నారు.
ఇక హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. పది రోజుల క్రితం సినిమా చూసాను. నాకు శేఖర్ కమ్ముల మంచి సినిమా ఇచ్చారు. ఇది అందరూ చూడాల్సిన సినిమా అందుకే ఈ కోవిడ్ పరిస్థితి చక్కబడిన తరువాత సినిమాను విడుదల చేస్తాము అని తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. సినిమా విడుదల కావడం లేదంటూ మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.
ట్వీట్..
వీడియో..
Also Read: కొత్త సినిమాను ప్రారంభించిన అక్కినేని అఖిల్.. ‘ఏజెంట్’ పూజా కార్యక్రమాలకు హజరైన నాగార్జున, అమల..
డ్డెక్కిన ‘కార్తీకదీపం’.. డాక్టర్ బాబు.. వంటలక్క కలవాలంటూ ఫ్లెక్సీలు.. ఎక్కడో తెలుసా..