
నందమూరి నటసింహం బాలయ్య రీసెంట్స్ టైమ్స్‌లో ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఆయన చుట్టూరా ప్రజంట్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ‘ఆహా’ ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్న బాలకృష్ణ.. తాజాగా ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘సింహ’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ శుక్రవారం బొమ్మ పడింది. మాస్ హిట్ అని సమాచారం అందుతోంది. బెనిఫిట్ షోలతో పాటు యూఎస్ షోలు పడ్డాయి. ఫ్యాన్స్ పూనకాలతో థియేటర్లలో ఊగిపోతున్నారు. బోయపాటి ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ అందించినట్టు రెస్పాన్స్ చూస్తూనే తెలుస్తోంది. షో చూసిన అభిమానులు.. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెబుతున్నారు. థియేటర్ల ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా అఖండ చూసిన సినిమా జనం ‘మాస్ జాతర’, ‘నెక్ట్స్ లెవల్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి నటసింహం హిట్ కొట్టారని అర్థం అవుతుంది. అయితే చిత్రం ఏ స్థాయి బ్లాక్ బాస్టర్ అవుతుందో తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.
Also Read: Akhanda : మొదలైన అఖండ సందడి.. థియేటర్స్ ముందు అభిమానుల హంగామా..