
Kaithi Hindi Remake : తెలుగు, తమిళ భాషల్లో పోయిన సంవత్సరం రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది ‘ఖైదీ’ చిత్రం. యంగ్ హీరో కార్తీ తన నటనతో మెస్మరైజ్ చేశాడు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తక్కువ బడ్జెత్ రూపొంది..సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చెయ్యాలని ఎప్పుడో అనుకున్నారు. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ మూవీ బాలీవుడ్ రీమేక్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.
హిందీలో చిత్రకథానాయకుడు ఎవరో రివీలైపోయింది. అజయ్ దేవగణ్ హీరోగా బాలీవుడ్లో ‘ఖైదీ’ చిత్రం తెరకెక్కనుంది. మాతృకకు దర్శకత్వం లోకేశ్ కనకరాజ్..రీమేక్‌కు కూడా డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు అజయ్. తెలుగులో ‘ఆర్.ఆర్.ఆర్’ యాక్ట్ చేస్తోన్న ఈ బాలీవుడ్ నటుడు.. హిందీలో ‘భుజ్: ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో కనిపించబోతున్నాడు.