Dacoit: అడివి శేష్ రేర్ రికార్డ్.. ‘డెకాయిట్’ సంచలనం.. మూడ్రోజుల్లో బ్రేక్ ఈవెన్..

అడివి శేష్ ఖాతాలో మరో హిట్ చేరింది. ‘డెకాయిట్’ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో సేఫ్ జోన్‌లోకి వెళ్లిన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో థియేట్రికల్ రన్‌లోనూ భారీ వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

Dacoit: అడివి శేష్ రేర్ రికార్డ్.. డెకాయిట్ సంచలనం.. మూడ్రోజుల్లో బ్రేక్ ఈవెన్..
Dacoit Movie

Edited By:

Updated on: Apr 13, 2026 | 6:28 PM

అడివి శేష్ ఖాతాలో మరో హిట్ పడింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. కేవలం మూడే మూడు రోజుల్లో ఈ సినిమా తన బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా సినిమా విడుదలకు ముందే పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే నిర్మాతలకు పెద్ద ఊరట లభిస్తుంది.. కానీ రిలీజ్ తర్వాత థియేటర్లకు భారీగా ప్రేక్షకులను రప్పించడమే అసలైన సవాలు. ఈ రెండు విషయాల్లోనూ ‘డెకాయిట్’ సక్సెస్ సాధించి ట్రేడ్ పండితులను సైతం అవాక్కయ్యేలా చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను మేకర్స్ సుమారు రూ. 65 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్ల గురించి వాళ్ళు పెద్దగా ఆందోళన చెందలేదు. ఎందుకంటే డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ అమ్మకాల ద్వారా విడుదలకు ముందే రూ. 48 కోట్లను వెనక్కి రాబట్టింది సినిమా. ఈ నాన్-థియేట్రికల్ డీల్స్ కారణంగా రిలీజ్‌కు ముందే మేకర్స్ చాలా సేఫ్ జోన్‌లో ఉండిపోయారు.

విడుదలకు ముందే రికవరీ భారీగా ఉండటంతో.. బాక్సాఫీస్ రేసులో ఈ సినిమా హిట్ అనిపించుకోవడానికి థియేట్రికల్ రన్ ద్వారా కేవలం రూ. 17 కోట్లు (షేర్) రాబట్టాల్సి వచ్చింది. ఈ ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్ చూసిన ఇండస్ట్రీ వర్గాలు, సినిమాకు కచ్చితంగా డీసెంట్ ఓపెనింగ్స్ వస్తాయని ముందే అంచనా వేశాయి. అయితే సినిమా ఆ అంచనాలను సైతం సునాయాసంగా దాటేసింది. మొదటి షో నుంచే ‘డెకాయిట్’ సినిమాకు టాక్ బాగానే రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. అద్భుతమైన మౌత్ టాక్‌తో కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఎవరూ ఊహించని విధంగా అత్యంత వేగంగా ఆ 17 కోట్ల థియేట్రికల్ షేర్ మార్క్‌ను దాటేసి.. బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ తన సత్తాను, స్ట్రాంగ్ రన్‌ను మరోసారి నిరూపించుకున్నాడు.

ఓపెనింగ్ వీకెండ్ ముగిసిన తర్వాత కూడా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతూనే ఉన్నాయి. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోని బయ్యర్లు తమ పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు ఇంకా కొద్దిగా సమయం పట్టినప్పటికీ.. ఓవరాల్ నంబర్స్ మాత్రం చాలా పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. కలెక్షన్ల జోరు చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు త్వరలోనే లాభాల బాట పట్టనున్నారు. పక్కా బడ్జెట్, బలమైన కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడూ విఫలం కాదని ‘డెకాయిట్’ మరోసారి రుజువు చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగులో మోస్ట్ బ్యాంకబుల్ హీరో అంటే ముందు నాని.. తర్వాత శేష్ గుర్తుకొస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలే వరసగా బ్రేక్ ఈవెన్ అవుతూ ఉన్నాయి. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2.. ఇప్పుడు డెకాయిట్ ఇలా అన్ని సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు శేష్.

Also Read: తండ్రి మరణం, బతకడం కోసం కొబ్బరి బోండాల కొట్టు.. ఇప్పుడు ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్.. 

Follow Us