ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ జోష్ మీదున్న ఈ అమ్మడు.. కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యింది. ఇటీవలే రాబిన్ హుడ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మకు నిరాశే ఎదురైంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అంతుక ముందు పుష్ప 2లో కిస్సిక్ పాటతో పాన్ ఇండియాను ఊపేసింది శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా అటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని సమాచారం. ఆమె స్థానంలోకి బీటౌన్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడాని ను తీసుకున్నట్లు టాక్. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న శ్రీలీల … అనుకోకుండా కార్తీక్ ఆర్యన్ నుంచి తప్పుకుందంట. అయితే ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. నివేదిక ప్రకారం, కార్తీక్ ఆర్యన్ తో ‘పతి పత్ని ఔర్ వో’ సినిమా సీక్వెల్ కోసం శ్రీలీల ఎంపికైంది.
కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ పేర్లు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్ నడిచింది. అంతకు ముందు ఐఫా అవార్డ్స్ వేడుకలో తనకు మంచి డాక్టర్ కోడలు కావాలంటూ కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ కు మరింత బలం చేకూరింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..