Eesha Rebba : చీరకట్టులో అదరగొట్టిన ఈషా రెబ్బ.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన శివాని

|

Apr 02, 2024 | 9:57 AM

బందిపోటు, అమీతుమీలాంటి సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా చేసింది. చాలా సినిమాల్లో నటించింది. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించింది. ఈ సినిమాతో ఈషాకు మంచి గుర్తింపు వచ్చింది. అరవింద సమేత తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది.

Eesha Rebba : చీరకట్టులో అదరగొట్టిన ఈషా రెబ్బ.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన శివాని
Eesha Rebba
Follow us on

తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్ గా సినిమాలు చేసి అంతగా సక్సెస్ కాలేకపోయింది. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ చిన్నది. ఆతర్వాత హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. బందిపోటు, అమీతుమీలాంటి సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా చేసింది. చాలా సినిమాల్లో నటించింది. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించింది. ఈ సినిమాతో ఈషాకు మంచి గుర్తింపు వచ్చింది. అరవింద సమేత తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే డిజిటల్ వరల్డ్ లోకి కూడా అడుగు పెట్టింది. త్రీరోజెస్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. కాగా ఈషా రెబ్బ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది ఈషా రెబ్బ. మోడ్రన్ డ్రస్సుల్లో మతిపోగొడుతోన్న ఈషా రెబ్బ.. చీరకట్టులోనూ కవ్విస్తుంది. తాజాగా ఈషా రెబ్బ కొన్ని ఫోటోలను వదిలింది.

తాజాగా ఈషా రెబ్బా పింక్ కలర్ చీరకట్టులో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల పై అభిమానులు, నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సెలబ్రెటీలు కూడా ఈషా రెబ్బ ఫోటోల పై కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరో తెలుగమ్మాయి శివాని రాజశేఖర్ ఈషా రెబ్బ ఫోటోలకు ఆసక్తికర కామెంట్స్ చేసింది. లుకింగ్ లైక్ వావ్.. చీర బాగుంది.. నాకు అది కావలి అని కామెంట్ చేసింది శివాని. కానీ ఏ మాటకు ఆ మాట.. చీర కట్టులో ఈషా మత్తెక్కించింది.

ఈషా రెబ్బ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.