
బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎంఎస్ ధోనీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సుశాంత్.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో కొన్ని నెలలపాటు రియా జైలు జీవితం గడిపింది. దాదాపు 5 సంవత్సరాలు ఆమె ఎన్నో నిందలు మోసింది. చివరకు ఈ కేసులో నిర్దోశిగా బయటకు వచ్చింది. గతేడాది సీబీఐ ఈ కేసును క్లోజ్ చేయడంతో ఆమెకు ఉపశమనం లభించింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో రియాకు మాత్రం పూర్తిగా నెగిటివిటీ తగ్గలేదు. ఆమె చేసిన ప్రతి పోస్టుకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అలాగే గత ఐదేళ్లు ఒక్క సినిమా చేయలేదు. ఇప్పుడు రియాకు ఓటీటీలో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.
తాజాగా ఈ అమ్మడు ఫ్యామిలీ బిజినెస్ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది రియా. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. నిజంగా నమ్మలేకపోతున్నాను. అంతా ఒక కలలా ఉంది. మళ్లీ నటిస్తానని అస్సలు ఊహించలేదు. యాక్టర్ కావాలని 17 ఏళ్ల వయసులో అనుకున్నాను. సినీ ప్రయాణం స్టార్ట్ చేశాను. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అవకాశాలు రాలేదు. నటనకు ముగింపు పలుకుదామని అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్నో మార్పులు.. ఇదెంత బాగుందో.. అంటూ రాసుకొచ్చింది. నా జీవితంలో ఇది రెండో చాప్టర్ అని రియా షేర్ చేయగా.. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
వీడియో జాకీగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు హిందీలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో తూనీగ తూనీగ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. మేరే డాడ్ కి మారుతి, సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, జిలేబి వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..