సౌందర్య మరణవార్త విని తట్టుకోలేకపోయింది.. పెళ్లి బట్టలతోనే సంతాప సభకు వెళ్లిన స్టార్ హీరోయిన్.!

సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణించారు సౌందర్య. అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఈ అగ్ర తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకున్న సౌందర్య చిన్నవయసులో కన్నుమూయడం ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది.

సౌందర్య మరణవార్త విని తట్టుకోలేకపోయింది.. పెళ్లి బట్టలతోనే సంతాప సభకు వెళ్లిన స్టార్ హీరోయిన్.!
Soundarya

Updated on: Oct 03, 2026 | 12:58 PM

తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లో సౌందర్య ముందు వరసలో ఉంటారు. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఆమె.. తన సహజ నటన, అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అదే సమయంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో నటితో సౌందర్యకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉండేదట. తెరపై ఇద్దరూ కథానాయికలుగా కనిపించినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం పోటీ భావనకు దూరంగా ఎంతో ఆప్యాయంగా మెలిగేవారని ఆమె ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఓ టాక్‌ షోలో పాల్గొన్న ఆమె.. సౌందర్యతో తన పరిచయం, ఆమె చూపించిన ఆప్యాయత, ముఖ్యంగా ఆమె మరణించిన సమయంలో చోటుచేసుకున్న ఓ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె మరెవరో కాదు అందాల తార రాశి. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య తనకంటే వయసులో పెద్దవారని, అందుకే తనను ఎప్పుడూ తోటి హీరోయిన్‌గా కాకుండా ఇంట్లోని చిన్నపిల్లలా చూసుకునేవారని రాశి తెలిపారు. షూటింగ్‌ సమయంలో ఇద్దరి గదులు పక్కపక్కనే ఉండేవని, ఆ కారణంగా తరచూ కలుసుకుంటూ ఉండేవారమని ఆమె తెలిపారు.

300లకు పైగా సినిమాలు.. తొలి సినిమాకే రూ. 15 రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజే వేరు

తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా సౌందర్య సిబ్బంది కూడా సరదాగా మాట్లాడుకునేవారని రాశి గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో ఇద్దరూ హీరోయిన్లుగా ఉన్నప్పటికీ.. ఆ పోటీ తమ వ్యక్తిగత సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు. సౌందర్య తనను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, చిన్నచెల్లిలా చూసుకునేవారని రాశి చెప్పుకొచ్చారు. రానురాను ఆ పరిచయం మంచి స్నేహంగా, కుటుంబ సభ్యుల మధ్య ఉండేంత సన్నిహితమైన బంధంగా మారిందని రాశి వివరించారు. సౌందర్య అనూహ్య మరణం సినీ పరిశ్రమతో పాటు ఆమెను వ్యక్తిగతంగా తెలిసినవారినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో తనకు ఎదురైన పరిస్థితులను రాశి గుర్తుచేసుకున్నారు.

కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ ఈ భామలు..! ఒకప్పుడు ఊపేశారు.. కానీ ఆతర్వాత సినిమాలు ఆపేశారు

హైదరాబాద్‌లో సౌందర్యకు సంతాప సభ నిర్వహిస్తున్నారని తెలిసినప్పుడు.. అక్కడికి వెళ్లి ఆమెకు చివరి నివాళులు అర్పించాలని రాశి నిర్ణయించుకున్నారట. అయితే అదే సమయంలో రాశి పెళ్లి వేడుకల్లో ఉన్నారట. పెళ్లి సమయంలో శుభకార్యం కారణంగా బయటకు వెళ్లకూడదని, ముఖ్యంగా సంతాప కార్యక్రమానికి హాజరు కావడం మంచిది కాదని కుటుంబ సభ్యులు సూచించారట. అయితే సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని రాశి ఆ మాటలను పట్టించుకోలేదని తెలిపారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా భావించే సౌందర్యకు నివాళులు అర్పించడం తనకు చాలా ముఖ్యమని భావించిన రాశి.. అప్పటికే ఉన్న పెళ్లికూతురి దుస్తుల్లోనే సంతాప సభకు వెళ్లారట. అక్కడ సౌందర్య చిత్రపటానికి పూలమాల వేసి కన్నీటి నివాళులు అర్పించినట్లు రాశి గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన మనసులో ఉన్న బాధను మాటల్లో చెప్పలేకపోయానని, సౌందర్యను కోల్పోయిన విషయం తనకు ఎంతో బాధ కలిగించిందని భావోద్వేగంతో తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది.. దెబ్బకు రెండు సినిమాలకే కనిపించకుండా పోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us