Nabha Natesh: గాలి ఎటు తీసుకెళితే అటు వెళ్లండి.. ఈస్మార్ట్‌ బ్యూటీ ఆసక్తికర పోస్ట్‌. నభా లేటెస్ట్ ఫొటోలు చూశారా?

Nabha Natesh: 2015లో వచ్చిన 'వజ్రకయ' అనే కన్నడ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార నభా నటేష్‌. అనంతరం కన్నడలో వరుసగా మూడు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ 2018లో వచ్చిన...

Nabha Natesh: గాలి ఎటు తీసుకెళితే అటు వెళ్లండి.. ఈస్మార్ట్‌ బ్యూటీ ఆసక్తికర పోస్ట్‌. నభా లేటెస్ట్ ఫొటోలు చూశారా?

Updated on: Aug 30, 2021 | 8:25 AM

Nabha Natesh: 2015లో వచ్చిన ‘వజ్రకయ’ అనే కన్నడ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార నభా నటేష్‌. అనంతరం కన్నడలో వరుసగా మూడు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ 2018లో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక 2019లో వచ్చిన ‘ఈస్మార్ట్‌’ శంకర్‌ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో మాస్ డైలాగ్‌లు పలుకుతూ మరోవైపు గ్లామర్‌షోతో కుర్రకారు మతి పోగొట్టిందీ చిన్నది. ఈ సినిమాతో నభాకు ఎక్కడలేని స్టార్‌డమ్‌ వచ్చేసింది. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ, సాయి ధరమ్‌ తేజ్‌ వంటి హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుందీ బ్యూటీ.

ఇక కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ నిత్యం బిజీగా ఉంటుందీ బ్యూటీ. సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది నభా. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నభా పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. బ్లాక్‌ కలర్‌ డ్రస్‌లో కవ్విస్తోన్న ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ చిన్నది.. ‘మిమ్మల్ని గాలి ఎటువైపు తీసుకెళ్తే.. అటువైపు వెళ్లండి’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. అంటే స్వేచ్ఛగా జీవించడమని అర్థం వచ్చేలా పోస్ట్‌ చేసిందన్నమాట. ఇక ఫొటోతో పాటు చీరకట్టులో, లంగావోణీలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నభా లేటెస్ట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Most Eligible Bachelor: అఖిల్ సినిమాలో ఆ స్టార్ కపుల్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ హీరో ఆయన భార్య..

Keerthy Suresh: మరో ఛాలెజింగ్‌లో క్యారెక్టర్‌లో మహానటి.. పెళ్లి కాకముందే తల్లి అయ్యే పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్‌.?

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.