
ముమైత్ ఖాన్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్‌లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అనే రేంజ్‌లో రాణించింది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది. హీరోయిన్‌గాను కొన్ని సినిమాల్లో మెరిసింది ముమైత్. అయితే ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు.. ఆ మధ్య బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడు బయట పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య ఓ టీవీ షోలో జడ్జ్ గా వ్యవహరించింది. ఇక ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.
తాజాగా ముమైత్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముమైత్ మాట్లాడుతూ.. ప్రభాస్ నటించిన యోగి చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకుంది. ముమైత్ మాట్లాడుతూ.. ప్రభాస్‌తో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ప్రభాస్ స్వతహాగా చాలా సిగ్గుపడే వ్యక్తి అని ఆమె వెల్లడించారు. యోగి చిత్రంలోని పాటల చిత్రీకరణలో, ముఖ్యంగా హగ్ చేసుకోవడం వంటి సన్నిహిత సన్నివేశాల సమయంలో ప్రభాస్ సిగ్గుపడటం గమనించినట్లు తెలిపారు.
ఇది ప్రభాస్‌తో ఆమెకు రెండో పాట అని, మొదటిసారి పని చేసినప్పుడు సాంగ్ షూటింగ్ చాలా నిశ్శబ్దంగా జరిగిందని ముమైత్ ఖాన్ గుర్తుచేసుకున్నారు. అయితే, రెండోసారి కలిసినప్పుడు ఆమె ప్రభాస్‌ను సరదాగా ఆటపట్టించడం ప్రారంభించా.. ఒకానొక సందర్భంలో, ప్రభాస్ విసిగిపోయి కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్‌ను పిలిచి, “సార్, మీ హీరోయిన్‌ను చూడండి సార్” అని అరిచాడు తెలిపింది. అప్పటికి ముంబై నుంచి వచ్చిన ముమైత్ ఖాన్‌కు అటువంటి సెట్ వాతావరణం కొత్త అయినప్పటికీ, ఆమె ప్రభాస్‌తో సరదాగా గడిపిందట. ప్రభాస్ ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నారని, అప్పటి నుండి వారు మంచి స్నేహితులయ్యారని ముమైత్ ఖాన్ తెలిపింది. వారి స్నేహానికి గుర్తుగా, అప్పటి నుండి వారు ప్రభాస్‌ను ప్రేమగా డార్లింగ్ అని పిలవడం మొదలుపెట్టా అని చెప్పుకొచ్చింది ముమైత్ ఖాన్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.