Meera Jasmine: అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న మీరాజాస్మిన్.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే

|

Aug 24, 2022 | 9:23 AM

ఒకప్పుడు అలరించిన అందాల భామల్లో మీరాజాస్మిన్ ఒకరు. ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడటానికి పద్దతిగా కనిపించే ఈ  ముద్దుగుమ్మకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

Meera Jasmine: అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్న మీరాజాస్మిన్.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే
Actress Meera Jasmine
Follow us on

ఒకప్పుడు అలరించిన అందాల భామల్లో మీరాజాస్మిన్(Meera Jasmine) ఒకరు. ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడటానికి పద్దతిగా కనిపించే ఈ  ముద్దుగుమ్మకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది మీరాజాస్మిన్. తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, రారాజు, మా ఆయన చంటి పిల్లాడు, గోరింటాకు, మహారథిలాంటి సినిమాల్లో నటించింది. చివరిగా ఆకాశ రామన్న సినిమాలో నటించి మెప్పించింది మీరా జాస్మిన్. ఈ సినిమా 2010లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఈ అమ్మడు అనూహ్యంగా సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తిరిగి యాక్టివేట్ అయ్యింది. సోషల్ మీడియాలో రకరాల ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తోంది.

మాములుగా పద్దతిగా కనిపించే మీరాజాస్మిన్ ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచేసింది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. మీరాజాస్మిన్ హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. మొన్నటివరకు సాంప్రదాయ దుస్తుల్లో చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంత అందాన్ని చూసి షాక్ అవుతున్నారు. లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్న మీరాజాస్మిన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ఈ అమ్మడి మరికొన్ని గ్లామరస్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాటపడకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది మీరాజాస్మిన్ ఈ ఫోటోల పై కుర్రాళ్ళు కొంటె కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తుందని, అందుకే ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తుందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి