Manchu Lakshmi: మంచి మ‌న‌సు చాటుకున్న మంచు ల‌క్ష్మి… క‌రోనాతో మ‌ర‌ణించిన వారి చిన్నారుల‌కు అండ‌గా..

|

May 22, 2021 | 12:07 PM

Manchu Lakshmi: క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌లో ఎంతో మంది ప్రాణాలను హ‌రిస్తోంది. స‌మ‌యానికి చికిత్స అంద‌క కొంద‌రు, ఆక్సిజ‌న్ ల‌భించ‌క మ‌రి కొంద‌రు ప్రాణాల‌ను వ‌దులుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి....

Manchu Lakshmi: మంచి మ‌న‌సు చాటుకున్న మంచు ల‌క్ష్మి... క‌రోనాతో మ‌ర‌ణించిన వారి చిన్నారుల‌కు అండ‌గా..
Manchu Lakshmi Corona
Follow us on

Manchu Lakshmi: క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌లో ఎంతో మంది ప్రాణాలను హ‌రిస్తోంది. స‌మ‌యానికి చికిత్స అంద‌క కొంద‌రు, ఆక్సిజ‌న్ ల‌భించ‌క మ‌రి కొంద‌రు ప్రాణాల‌ను వ‌దులుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి ఎంతో మంది చిన్నారుల‌ను ఆనాథ‌లుగా మారుస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా సృష్టిస్తోన్న క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించేందుకు కొంద‌రు మ‌న‌సున్న మంచి మ‌న‌సులు ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు విరాళాలు సేక‌రిస్తూ క‌రోనా బాధితుల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
తాజాగా న‌టి మంచు ల‌క్ష్మి కూడా క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. ఇందులో భాగంగా ‘టీచ్ ఫ‌ర్ చేంజ్’ అనే స్వ‌చ్చంద సంస్థ‌తో క‌లిసి 1000 మంది పిల్ల‌ల‌కు విద్య‌, వైద్యం ఇత‌ర ప్రాథ‌మిక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు సహాయం అందించనున్నారు. ఆదాయం త‌క్కువ‌గా ఉన్న కుటుంబాల‌ను గుర్తించి వారిలో 1000 మందికి విద్య‌, ట్యూష‌న్, బ‌ట్ట‌ల‌తో పాటు ఇత‌ర స‌హాయం అదించ‌నున్నారు. ఈ విష‌య‌మై మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ.. కరోనా వల్ల దురదృష్టవశాత్తూ కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులను పొగొట్టుకున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి సహాయం చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. ఇక లాక్‌డౌన్ స‌మ‌యంలో 1000 మందికి భోజనాలు పంపిణీ చేసేందుకు కొన్ని ఆసుపత్రులను ఎంచుకున్నామని చెప్పిన మంచు ల‌క్ష్మి.. వారి కోసం టీచ్ ఫర్‌ చేంజ్‌ బృందం, వాలంటీర్స్ తో పాటు బృంద సభ్యులు ప్రతిరోజూ వారికి ఆహారం ఇచ్చి ఆకలిని తీర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ల‌క్ష్మి.

మంచు ల‌క్ష్మి చేసిన ట్వీట్‌..

Also Read: ముడుపుల కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ క్లీన్ చిట్, మరి ఇన్నేళ్ల విచారణ నీరుగారిపోయిందా ?

CM KCR condolences : తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని, గాయకుడ్ని కోల్పోయింది : ముఖ్యమంత్రి కేసీఆర్

కంటికి కనిపించే దేవుళ్ల పాలిట శనిలా కరోనా…రోజురోజుకూ పెరుగుతున్న డాక్టర్ల మరణాలు