
ప్రస్తుతం సెలబ్రెటీలు అందరూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హీరోయిన్స్ నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఫోటోషూట్స్, మూవీ అప్డేట్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటారు. అంతేకాకుండా.. కొన్నిసార్లు ఫాలోవర్లతో లైవ్ చిట్ చాట్ నిర్వహిస్తూ.. వారి అడిగే ప్రశ్నలకు తమదైన స్టైల్లో సమాధానాలిస్తారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు నెటిజన్స్ తమ పరిధిని దాటి మరీ హీరోయిన్లను ప్రశ్నలను అడగడం.. తారలు స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వడం కామన్.. తాజాగా హీరోయిన్ మాళవికా మోహనన్‌కు (Malavika Mohanan) కూడా ఇలాంటి చెదు అనుభవమే ఎదురైంది. ఎప్పుడు నెట్టింట్లో యాక్టివ్ గా ఉండే మాళవికా.. తాజాగా అభిమానులతో #AskMalavika అంటూ ముచ్చటించింది. అందులో ఓ నెటిజన్ అడిగిన తిక్క ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.
తమిళ్ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి నటించిన సినిమాలో బెడ్ సీన్లను ఎన్నిసార్లు చిత్రీకరించారని అంటూ నెటిజన్స్ పిచ్చి ప్రశ్న వేయగా.. మాళవిక స్పందించింది.. ముందు నీ తలలో ఏదో పాడైనట్లుంది.. అంటూ తన స్టైల్లో మరోసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జయాల్తో కలిసి యుధ్రా అనే సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ సినిమా చేయాలనుందంటూ ఇటీవలే తన మనసులోని మాటలను బయట పెట్టింది ఈ అమ్మడు. మాళవిక.. పెట్టా, మాస్టర్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.