
ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అలాగే సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా బతుకమ్మ ఉత్సవాల్లో భాగమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బతుకమ్మ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైంది లయ. అనంతరం బతుకమ్మ పూలను ఒక చోట పేర్చి పూజలు చేసింది. అనంతరం తన వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘బతుకమ్మ పండుగ అంటే పువ్వులు, స్త్రీతత్వం, తెలంగాణ అందమైన వారసత్వానికి ఒక వేడుక’ అంటూ తన వీడియోకు ఒక క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం లయ బతుకమ్మ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది లయ.
తనదైన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సావిత్రి, సౌందర్య తర్వాత తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అయితే సినిమా కెరీర్ స్పీడ్ గా ఉంటున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది లయ. దీంతో క్రమంగా సినిమాలకు దూరమైంది. భర్తతో కలిసి విదేశాల్లో సెటిలైపోయింది. అయితే పిల్లలు పెరిగి పెద్ద వారవ్వడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది లయ. గతేడాది నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసిందీ అందాల తార. ఇక ఈ ఏడాది శివాజీతో కలిసి సాంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. అలాగే జగపతిబాబుతో కలిసి వదలా, హీరో శ్రీకాంత్ తో కలిసి మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. కేవలం వెండితెరపైనే కాదు అప్పుడప్పుడు బుల్లితెరపైనా సందడి చేస్తోంది లయ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.