
ఒకప్పుడు తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న భామల్లో లైలా ఒకరు. ఈ అమ్మడు తన అందం, అమాయక చూపులతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా లైలా స్మైల్ కు ఎవ్వరైనా పడిపోవాల్సిందే.. తెలుగు తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది ఈ చిన్నది. కెరీర్ పీక్ లో ఉండగానే ఈ ముద్దుగుమ్మ సినిమాకు బ్రేక్ ఇచ్చింది. పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఆ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కొన్ని సినిమాల్లో మెరిసింది కానీ అనుకున్నంతగా బిజీగా కాలేదు ఈ అమ్మడు. అయితే మొదట్లో పైలెట్ అవ్వాలనుకుంది ఈ చిన్నది అయితే, ఆమె తల్లికి లైలా వెండితెరపై మెరిసిపోవాలని బలమైన కోరిక ఉండేది. మేకప్, మోడలింగ్, నటనపై ఆసక్తి లేకపోయినా, తల్లి కోరిక మేరకు లైలా 15 ఏళ్ల వయస్సు నుంచే ర్యాంప్ వాక్స్, చిన్న చిన్న ప్రకటనలలో నటించడం ప్రారంభించారు. ముంబైకి మకాం మార్చిన తర్వాత, లైలా తల్లి ఆమెను నటన కోర్సుల్లో చేర్చి, బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించారు. దుష్మన్ దునియా కా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.
మలయాళ చిత్రాలలో కూడా అపజయాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఎగిరే పావురమా చిత్రం కోసం ఆమెను ఎంపిక చేశారు. ఎగిరే పావురమా విజయంతో లైలా జాతకం మారింది. తెలుగులో ఉగాది, పెళ్లి చేసుకుందాం రా, ఖైదీ గారు, పవిత్ర ప్రేమ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కోలీవుడ్‌లో సూర్యతో కలిసి నటించిన సినిమాలు ఆమెకు గొప్ప గుర్తింపు తెచ్చాయి. సూర్యతో ఆమెకు ప్రేమాయణం నడిచిందనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఆమె ఐటమ్ సాంగ్స్, సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. లైలా జీవితంలో మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆమె నిరంతరం నవ్వుతూ ఉండేవారు.
శివపుత్రుడు చిత్రం షూటింగ్ సమయంలో విక్రమ్ ఈ విషయాన్ని గమనించి, ఒక నిమిషం నవ్వు ఆపుకోవాలని ఛాలెంజ్ చేశారు. కానీ లైలా 30 సెకన్లు కూడా నవ్వును ఆపుకోలేకపోయారట, నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తే ఆమె కళ్ళ నుండి నీళ్లు వచ్చేవట. వైద్యులు దీనిని ఒక రకమైన కండిషన్ అని నిర్ధారించారు. నవ్వు ఆమెకు ఒక వరం కాదు, ఒక శాపం అని అప్పుడు అర్థమైందట. ఇదొక వింత వ్యాధి.. ఆమె నవ్వును కంట్రోల్ చేసుకోలేదు. ప్రతి చిన్న విషయానికీ నవ్వేస్తుంది. సీరియస్ సిచువేషన్ లో కూడా ఆమె నవ్వేస్తుంది. కాగా ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరానియన్ వ్యాపారవేత్త మెహదీని 2006లో లైలా వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులతో కుటుంబ జీవితం సంతోషంగా గడుపుతున్నారు. కాగా లైలా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం లైలా వెబ్ సిరీస్‌లు, సినిమాలలో నటిస్తూ తన రెండవ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.