Keerthy Suresh: అమ్మబాబోయ్..!! కీర్తి సురేష్ పూర్వీకుల ఇల్లు చూస్తే మతిపోవాల్సిందే..

|

Nov 23, 2022 | 3:10 PM

తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన నేను మహానటి సినిమాతో సంచనలన విజయాన్ని అందుకుంది కీర్తిసురేష్.

Keerthy Suresh: అమ్మబాబోయ్..!! కీర్తి సురేష్ పూర్వీకుల ఇల్లు చూస్తే మతిపోవాల్సిందే..
Keerthi Suresh
Follow us on

యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ కీర్తిసురేష్. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన నేను మహానటి సినిమాతో సంచనలన విజయాన్ని అందుకుంది కీర్తిసురేష్. మహానటి సావిత్రి జీవితకథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అచ్చం సావిత్రిగారిలా అద్భుతంగా నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయింది. ఆ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తెలుగుతో పాటు, తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది.

ఇక కీర్తిసురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన సినిమా న్యూస్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ  భామ. తాజాగా తన పూర్వీకుల ఇంటి గురించి వివరించింది కీర్తిసురేష్. కీర్తి సురేష్ తన ఫ్యామిలీతో కలిసి తమిళనాడులోని తమ పూర్వీకుల ఇంటికి వెళ్లింది..

ఇవి కూడా చదవండి

ఆ విషయాలను అక్కడి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఎంత స్టార్ గా ఎదిగిన తన మూలాలు మర్చిపోలేదు కీర్తిసురేష్. దాంతో ఈ అమ్మడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇల్లంతా కలియతిరుగుతూ.. అక్కడ కాసేపు సేదతీరింది. ఇప్పుడు ఏ ఫొటోలు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈవీడియో పై మీరూ ఓ లుక్కెయండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.