Hansika: సూసేకి అగ్గి రవ్వ మాదిరి.. పుష్ప 2 పాటకు స్టెప్పులేసిన హన్సిక.. లంగా ఓణీలో అదరగొట్టిందిగా.. వీడియో

పుష్ప 2 ది రూల్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ సీక్వెల్ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్‌ 15న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటి నుంచే షురూ చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసింది

Hansika: సూసేకి అగ్గి రవ్వ మాదిరి.. పుష్ప 2 పాటకు స్టెప్పులేసిన హన్సిక.. లంగా ఓణీలో అదరగొట్టిందిగా.. వీడియో
Hansika
Follow us

|

Updated on: Jun 16, 2024 | 6:31 PM

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్‌ లో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక పుష్ప సినిమా ఎంత హిట్‌ అయ్యిందో, అందులోని పాటలు, డైలాగులు, మేనరిజమ్స్ కూడా అంతకుమించి హిట్‌ అయ్యాయి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రానుంది. పుష్ప 2 ది రూల్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ సీక్వెల్ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్‌ 15న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటి నుంచే షురూ చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసింది. పుష్ప పుష్పా టైటిల్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డుల మోత మోగించగా.. ఇటీవల రిలీజైన సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాట సినిమాపై మరింత హైప్‌ను పెంచేస్తోంది. తెలుగు, హిందీ వర్షన్స్‌ కలుపుకుని ఈ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్‌ (పది కోట్ల) వ్యూస్‌ రాబట్టడం విశేషం.

ఇక సోషల్ మీడియాలోనూ సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ మార్మోగిపోతోంది. సినీ అభిమానులు, నెటిజన్లతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సాంగ్ కు రీల్స్ చేస్తున్నారు. తమదైన శైలిలో స్టెప్పులేస్తూ పుష్ప 2 పాటను రీక్రియేట్ చేస్తున్నారు. తాజాగా యాపిల్ బ్యూటీ హన్సిక సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ కు స్టెప్పులేసింది. అచ్చ తెలుగమ్మయిలా లంగా ఓణి ధరించిన ఈ ముద్దుగుమ్మ నలుగురు కుర్రాళ్లతో కలిసి సూపర్బ్ గా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. హన్సిక డ్యాన్స్ అదిరిపోయిందంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతోనే హన్సిక సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఇవి కూడా చదవండి

హన్సిక డ్యాన్స్ వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

వంద మిలియన్ల క్లబ్ లో పుష్ప 2 సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles