ఆ వ్యాధి ఉంది.. అందుకే నవ్వడం మొదలెడితే ఆపుకోలేను

25 June 2024

TV9 Telugu

TV9 Telugu

అనుష్కా శెట్టి.. ఈ పేరు వినగానే డైనమిక్‌ కథానాయిక, హీరోలతో సమానంగా తలపడే అందమైన అమ్మాయి రూపం కళ్ల ముందు ప్రత్యక్ష మవుతుంది

TV9 Telugu

చక్కటి అందం, అభినయం ప్రదర్శిస్తూనే.. రాజసం ఒలికించేలా ఆమె చేసిన విభిన్న పాత్రలే  సినీ అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా చేశాయి

TV9 Telugu

అయితే ఈ టాలీవుడ్‌ స్టార్‌ నాయిక.. నిజ జీవితంలో ఓ అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల వెల్లడించింది. దానివల్ల తనకు ఎదురైన అనుభవాలనూ సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంది

TV9 Telugu

ఇది విని ఆమె ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఆ సమస్యేంటంటే ‘Pseudobulbar Affect (PBA) అనే అరుదైన లాఫింగ్‌ డిసీజ్‌. దీని గురించి స్వీటీ చెబుతూ..

TV9 Telugu

నాకు లాఫింగ్‌ డిసీజ్‌ ఉంది. నవ్వడం కూడా ఓ సమస్యేనా అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు మాత్రం అదే పెద్ద సమస్య! ఎందుకంటే నేను నవ్వడం ప్రారంభిస్తే 15-20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా 

TV9 Telugu

కామెడీ సినిమాలు చూసినా, కామెడీ సీన్లు చేస్తున్నప్పుడైనా.. ఒకసారి నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేను. ఒక్కోసారి పడీ పడీ నవ్వేస్తుంటా. ఇలా నా నవ్వు కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి

TV9 Telugu

దీనివల్ల నాకు అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. షూటింగ్‌లో ఇలా జరిగినప్పుడు చిత్ర బృందం టీ, కాఫీ, స్నాక్స్‌ తీసుకోవడానికి విరామంగా ఉపయోగించుకుంటూ ఉంటారంటూ అనుస్క తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది

TV9 Telugu

మెదడుకు గాయాలవడం, బ్రెయిన్‌ స్ట్రోక్, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన గాయాలు, అల్జీమర్స్‌ వ్యాధి.. వంటి మెదడు సంబంధిత సమస్యల కారణంగా.. భావోద్వేగ వ్యక్తీకరణను నియంత్రించే నాడీ వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడ్డం వల్ల పీబీఏ తలెత్తుతుంది