క్యూట్ లుక్స్ తో కిక్కెస్తున్న అనసూయ లేటెస్ట్ పిక్స్

TV9 Telugu

25 June 2024

యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

బుల్లితెరకు దూరమై వెండి తెరపై నటిస్తూ అలరిస్తుంది. 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనసూయ.

తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ మారి ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్‌గా చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అనసూయ.

తర్వాత నెమ్మది గా సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ. 

అనసూయ తన ఫ్యామిలీ తో కలిసి వెళ్లిన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది.

అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉండటం తో బుల్లి తెరకు బై చెప్పి చెప్పేసింది. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.

మలయాళంలో కూడా ఆమధ్య సినిమా చేసిన అనసూయ, ఇప్పుడు ఇటు తెలుగు, అటు తమిళంలో సినిమాలతో బిజీగా ఉంటూ, టీవిలో కూడా కనిపిస్తూ ఉంటుంది.