
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ డింపుల్ హయాతీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది బిజీ బిజీగా ఉంటోంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తోంది. ఇప్పటికే డింపుల్ హయాతీ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో హీరోయిన్ గా నటించింది డింపుల్. కొన్ని రోజుల క్రితమే విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబంలోనూ సెకెండ్ హీరోయిన్ గా చేసిందీ అందాల తార. ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు వస్తుందీ ముద్దుగుమ్మ. టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ‘భోగి’. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ శుక్రవారం (నవంబర్ 27)న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో శర్వానంద్ తో పాటు చిత్ర బృంద మంతా ఈ వేడుకకు హాజరైంది.
కాగా భోగి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది డింపుల్. మందారం రంగు చీరలో ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె తన అందంతో అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇదే క్రమంలో హీరో శర్వానంద్‌తో మరింత క్లోజ్‌గా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఓ నెటిజన్.. డింపుల్‌కు కూడా పెళ్లయిపోయిందా అంటూ కామెంట్ చేశాడు. దీనికి హీరోయిన్ డింపుల్ హయాతి కూడా వెంటనే స్పందించింది. ‘ఐ యామ్ నాట్ మ్యారీడ్ అంటూ రిప్లై ఇచ్చింది. తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ డింపుల్ ఇచ్చిన ఈ ఫన్నీ రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శర్వానంద్‌తో కాస్తా క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన పెళ్లయిపోయిందా అని అడుగుతారా అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా డింపుల్ కు పెళ్లయిపోయిందని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. భర్త పేరు కూడా నెట్టింట వైరల్ గా మారింది. అయితే మొత్తానికి ప్రస్తుతానికి తాను సింగిల్ అని మాత్రం డింపుల్ క్లారిటీ ఇచ్చేసింది.
‘భోగి’ చిత్రంలో డింపుల్ హయాతి ‘మందారం’ అనే పవర్ఫుల్ పాత్రలో నటించింది. కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇప్పటివరకు తనపై ఉన్న గ్లామర్ ఇమేజ్ను ఈ సినిమా పూర్తిగా మార్చేస్తుందని డింపుల్ చెబుతోంది.
Dimple Hayathi
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.